ఫిదా, తొలిప్రేమ లాంటి బాక్ టు బాక్ బ్లాక్ బస్టర్స్ తర్వాత అంతరిక్షం సినిమా తో అంచనాలను అందుకోలేక పోయాడు కానీ వెంకీ తో కలిసి చేసిన ఎఫ్ 2 సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది, ఏకంగా 84 కోట్ల రేంజ్ లో షేర్ ని వసూల్ చేసి సంచలనం సృష్టించింది. అలాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వరుణ్ తేజ్ చేస్తున్న కొత్త సినిమా వాల్మీకి బాక్స్ ఆఫీస్ దగ్గర…
ఈ శుక్రవారం భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుండగా ఇందులో ఈ సారి నెగటివ్ రోల్ లో కనిపించబోతున్నాడు వరుణ్ తేజ్, అయినా కానీ సాంగ్స్ అండ్ ప్రోమోస్ అంచనాలను పెంచడం తో సినిమా బిజినెస్ కూడా బాగానే జరిగింది అని చెప్పాలి.
ఏరియాల వారిగా సినిమా సాధించిన టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ ని ఒకసారి గమనిస్తే….
?Nizam: 7.4Cr
?Ceeded: 3.35Cr
?Andhra: 9Cr
?AP-TG:- 19.75Cr
?Ka & ROI: 1.50Cr
?USA: 2.2Cr
?ROW: 0.80Cr
Total Worldwide: Rs 24.25Cr… ఇదీ మొత్తం మీద వరుణ్ తేజ్ వాల్మీకి సాధించిన టోటల్ బిజినెస్ లెక్కలు.
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మినిమమ్ 25 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. టాక్ బాగుంటే సినిమా కి అక్టోబర్ 2 వరకు కొత్త సినిమాల నుండి పెద్దగా పోటి ఉండదు కాబట్టి కచ్చితంగా బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకునే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పాలి.
డానికి తోడూ హీరో ఫామ్ లో ఉండటం, సినిమా సాంగ్స్ అండ్ ట్రైలర్ కి రెస్పాన్స్ బాగా రావడం, ఆల్ రెడీ సూపర్ హిట్ అయిన సినిమాను రీమేక్ చేయడం ఇవన్నీ పాజిటివ్స్ కాబట్టి సినిమా జస్ట్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే సరిపోతుంది అని చెప్పాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.