Home గాసిప్స్ ఫ్యామిలీ స్టార్ కి విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ ఎన్ని కోట్లో తెలుసా!!

ఫ్యామిలీ స్టార్ కి విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ ఎన్ని కోట్లో తెలుసా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ సమ్మర్ లో బెస్ట్ రిలీజ్ డేట్ కి ఆడియన్స్ ముందుకు వచ్చిన మూవీ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నటించిన ది ఫ్యామిలీ స్టార్(Family Star Movie) సినిమా….సమ్మర్ లో రిలీజ్ అవ్వాల్సిన పెద్ద సినిమాలు పోస్ట్ పోన్ అవ్వడంతో సోలో సమ్మర్ బిగ్గీగా వచ్చిన ఈ సినిమా….

మంచి టాక్ ను సొంతం చేసుకుంటే కచ్చితంగా దుమ్ము లేపే వసూళ్ళని అందుకుని ఉండేది కానీ ఓవరాల్ గా మొదటి ఆట నుండే సోషల్ మీడియాలో విపరీతమైన నెగటివ్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఏ దశలో కూడా అంచనాలను అందుకోలేక పోయింది. ఓవరాల్ గా సినిమా 90 కోట్ల రేంజ్ భారీ బడ్జెట్ తో…

తెరకెక్కగా  కలెక్షన్స్ పరంగా 17 కోట్లకు పైగా షేర్ ని మాత్రమే అందుకుని తీవ్రంగా నిరాశ పరిచింది. ఈ సినిమా కి గాను అందరికీ భారీ లెవల్ లో రెమ్యునరేషన్ లు వెళ్ళగా వరుస ఫ్లాఫ్స్ లో ఉన్నా కూడా విజయ్ దేవరకొండకి కూడా భారీ రెమ్యునరేషన్ సొంతం అయ్యిందని టాలీవుడ్ సమాచారం. ఆల్ మోస్ట్ ఈ సినిమా కోసం…

The Family Star 6 Days Total WW Collections!!

విజయ్ దేవరకొండ 14 కోట్ల రేంజ్ దాకా రెమ్యునరేషన్ ని తీసుకున్నాడని టాలీవుడ్ లో టాక్ ఉంది. గీత గోవిందం,టాక్సీవాలా సినిమాల తర్వాత హిట్ లేక పోయినా కూడా సినిమా సినిమాకి విజయ్ దేవరకొండ మార్కెట్ నాన్ థియేట్రికల్ రైట్స్ పెరగడం విశేషం కాగా అందుకే ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ విజయ్ దేవరకొండకి దక్కింది అని అంటున్నారు…

కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకోవడంతో హీరోతో పాటు డైరెక్టర్ కూడా తమ రెమ్యునరేషన్ నుండి పెద్ద అమౌంట్ నే మేకర్స్ కి వెనక్కి ఇవ్వడానికి సిద్ధం అయ్యారన్న టాక్ ఉంది. ఇక విజయ్ దేవరకొండ తన అప్ కమింగ్ మూవీస్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కంబ్యాక్ ను సొంతం చేసుకుంటాడో చూడాలి ఇక..

The Family Star 1st Week (7 Days) Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here