బాక్స్ ఆఫీస్ దగ్గర సౌత్ మూవీస్ పరంగా లాస్ట్ 6-7 నెలల్లో చాలా సినిమాలే పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ ను సొంతం చేసుకున్నాయి. వాటిలో ఆర్ ఆర్ ఆర్ కేజిఎఫ్2 లాంటి మమ్మోత్ పాన్ ఇండియా మూవీస్ ని పక్కకు పెడితే మిగిలిన పాన్ ఇండియా మూవీస్ లో రాధే శ్యామ్ ఘోరంగా విఫలం అవ్వగా అంతకన్నా ముందే లిమిటెడ్ రిలీజ్ టు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా పుష్ప సినిమా నిలిచింది.
టోటల్ రన్ లో ఏకంగా 360 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుని దుమ్ము దుమారం లేపగా ఇప్పుడు కమల్ హాసన్ లేటెస్ట్ మూవీ విక్రమ్ కూడా పాన్ ఇండియా లెవల్ లోనే రిలీజ్ అవ్వగా ఈ సినిమా ఇప్పుడు 17 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో…
పుష్ప గ్రాస్ 360 కోట్లను క్రాస్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర 400 కోట్ల గ్రాస్ వైపు అడుగులు వేస్తుంది. లాస్ట్ డికేట్ మొత్తం మీద కమల్ హాసన్ కి సొంతం అయిన కంబ్యాక్ ఏ హీరోకి కూడా దక్కలేదు అనే చెప్పాలి. సౌత్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలుస్తూ దూసుకుపోతున్న విక్రమ్ ఇప్పుడు సౌత్ మూవీస్ లో వన్ ఆఫ్ హైయెస్ట్ గ్రాస్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది…