హిట్స్ లేక ఆల్ మోస్ట్ చాలా స్లో అయిన డైరెక్టర్ లు శ్రీకాంత్ అడ్డాల మరియు వినాయక్ లు, కమర్షియల్ సక్సెస్ లతో ఒకప్పుడు టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా పేరు సొంతం చేసుకున్న వినాయక్ ప్రస్తుతం సినిమాలు లేక కంప్లీట్ స్లో డౌన్ అవ్వగా మరో పక్క క్లాస్ మూవీస్ తో కెరీర్ మొదలు పెట్టి మంచి పేరు తెచ్చుకున్న ఒక్క డిసాస్టర్ మూవీ తో కెరీర్ లో ఆల్ టైం…
లో కి వెళ్ళిన డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ఇప్పుడు తన ప్రీవియస్ మూవీస్ కి ఏమాత్రం సింక్ లేని ఊరమాస్ కథ అయిన అసురన్ ని తెలుగు లో నారప్ప గా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక వినాయక్ ప్రస్తుతం కొత్త ఛాన్సుల కోసం ఎదురు చూస్తూ ఉండగా…
చిరు తో లూసిఫర్ రీమేక్ ఛాన్స్ వచ్చినా కానీ కథ సెట్ అవ్వక పోవడం తో ఆ సినిమా నుండి తప్పుకోవడం తో కొత్త ఛాన్స్ కోసం ఎదురు చూస్తుండగా ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాల అనుకున్న ప్రాజెక్ట్ ఇప్పుడు వినాయక్ దగ్గరకు వెళ్ళబోతుంది అంటూ వార్తలు ప్రచారంలో ఉన్నాయి.
శ్రీకాంత్ అడ్డాల ఇప్పుడు నారప్ప ఫైనల్ స్టేజ్ లో ఉండగా ఈ సినిమా తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ ఓకే చేసిన తమిళ్ బ్లాక్ బస్టర్ కర్ణన్ తెలుగు రీమేక్ కి డైరెక్టర్ గా అనుకున్న విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ఏమయిందో తెలియదు కానీ నారప్ప బాలెన్స్ షూటింగ్ ఇంకా ఉండటం లాంటివి ఈ ప్రాజెక్ట్ నుండి అడ్డాల ని కాకుండా ఇప్పుడు…
వినాయక్ ని తీసుకోబోతున్నారు అని తెలుస్తుంది. ప్రస్తుతం వినాయక్ ఖాళీగానే ఉండటం తో ఈ ప్రాజెక్ట్ తెలుగు మార్పులను సిద్ధం చేస్తున్నారని లేటెస్ట్ టాలీవుడ్ టాక్. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందీ అన్నది తెలియాల్సి ఉండగా త్వరలోనే ఈ విషయం పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఉండే అవకాశం ఉంది.