Home న్యూస్ 2 డేస్ ఆదికేశవ టోటల్ కలెక్షన్స్….ఏంటి సామి ఇదీ!

2 డేస్ ఆదికేశవ టోటల్ కలెక్షన్స్….ఏంటి సామి ఇదీ!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఉప్పెన లాంటి సెన్సేషనల్ మూవీ తర్వాత చేసిన సినిమాలు అంచనాలను అందుకునే విషయంలో విఫలం అవుతూ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్(Panja Vaishnav Tej) నటించిన కొత్త సినిమా ఆదికేశవ(AadiKeshava Movie) రీసెంట్ గా రిలీజ్ అయ్యి మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా…

సినిమా ఓపెనింగ్స్ ఏమాత్రం అంచనాలను అందుకోలేక పోయింది, మాస్ కమర్షియల్ మూవీ గా వచ్చినా కూడా సినిమాలో కథ ఏమాత్రం బలంగా లేక పోవడంతో ఓపెనింగ్స్ నిరాశ పరచగా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. సినిమా మొదటి రోజున…

టోటల్ గా 75 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా రెండో రోజు డ్రాప్ అయిన సినిమా 50 లక్షల రేంజ్ లో షేర్ ని మాత్రమే సొంతం చేసుకుని నిరాశ పరిచింది. సినిమా వరల్డ్ వైడ్ గా 60 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా టోటల్ గా 2 రోజుల్లో సినిమా వరల్డ్ వైడ్ గా 1.60 కోట్ల రేంజ్ లో షేర్ ని…

(AadiKeshava 2 Days Collections)
మాత్రమే సొంతం చేసుకోగా గ్రాస్ లెక్క 3 కోట్ల రేంజ్ లో ఉంది. సినిమా ఓవరాల్ గా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 9 కోట్ల రేంజ్ లో ఉండగా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా సినిమా ఇంకా 7.40 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. సినిమా రెండో డ్రాప్ తో ఇక తేరుకునే అవకాశం లేనట్టే అనిపిస్తుంది ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here