కర్నాటక ఇండస్ట్రీ నుండి అత్యంత భారీ ఎత్తున నిర్మాణం అయిన బిగ్గెస్ట్ మూవీస్ లో రీసెంట్ మూవీ కురు క్షేత్రం ఒకటి, సినిమా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా ఒక్క కన్నడ లోనే కాకుండా మిగిలిన మేజర్ భాషల్లో కూడా భారీ ఎత్తునే రిలీజ్ అయింది. కాగా సినిమా ను ఇతర భాషల్లో సరిగ్గా ప్రమోట్ చేయలేదు కానీ ఉన్నంతలో సినిమా మిగిలిన చోట్ల పర్వాలేదు అనిపించే వసూళ్ళ ని సాధించింది.
ఇక సినిమా ను మొత్తం మీద 100 కోట్ల రేంజ్ బడ్జెట్ లో రూపొందించి నట్లు సమాచారం… కానీ మొత్తం మీద థియేట్రికల్ బిజినెస్ కర్ణాటక లో 45 కోట్ల రేంజ్ లో జరగగా తర్వాత అక్కడ భారీ వర్షాల వలన మరింత తగ్గింది 40 కోట్లకు మార్చారు. కాగా ఫైనల్ కలెక్షన్స్ ని అఫీషియల్ గా రిలీజ్ చేయలేదు, ట్రేడ్ లెక్కల్లో సినిమా ఫైనల్ రన్ లో కన్నడలో….
77 కోట్ల ల దాకా గ్రాస్ ని వసూల్ చేసినట్లు సమాచారం. అందులో షేర్ 43 కోట్లు ఉంటుందని సమాచారం. ఇక సినిమా తెలుగు రాష్ట్రాలలో 2.5 కోట్ల బిజినెస్ ని సొంతం చేసుకోగా ఫైనల్ రన్ లో 1.6 కోట్ల దాకా షేర్ ని 3.1 కోట్ల దాకా గ్రాస్ ని వసూల్ చేసింది.
టోటల్ ఓవర్సీస్ లో 3 కోట్ల దాకా గ్రాస్ ని, తమిళ్ వర్షన్ 25 లక్షల దాకా గ్రాస్ ని అందుకుందట. ఇక ఇండియాలో మిగిలిన చోట్ల మొత్తం మీద 60 లక్షల దాకా గ్రాస్ ని సినిమా వసూల్ చేసినట్లు సమాచారం. టోటల్ గా సినిమా బిజినెస్ అన్ని చోట్లా కలిపి 49 కోట్ల వరకు ఉండగా…
ఫైనల్ రన్ లో సినిమా కన్నడ లో 43 కోట్లు, తెలుగు లో 1.6 కట్లు, తమిళ్ లో 12 లక్షలు, రెస్ట్ ఆఫ్ వరల్డ్ 35 లక్షలు, ఓవర్సీస్ 1.6 కోట్లు షేర్ దక్కించుకుని టోటల్ గా 84 కోట్ల దాకా గ్రాస్ ని, 46.67 కోట్ల దాకా షేర్ ని సొంతం చేసుకుని క్లీన్ హిట్ గా నిలిచింది. బడ్జెట్ దృశ్యా శాటిలైట్ రైట్స్ స్ట్రీమింగ్ రైట్స్ తో ఆల్ మోస్ట్ నిర్మాతలు సేఫ్ అని అంటున్నారు. టోటల్ గా సినిమా ప్రాఫిటబుల్ మూవీ గా నిలిచింది.