Home న్యూస్ 130 కోట్ల సినిమా…కానీ అక్కడ ముగ్గురే…బాలీవుడ్ షాక్!

130 కోట్ల సినిమా…కానీ అక్కడ ముగ్గురే…బాలీవుడ్ షాక్!

1916
0

బాలీవుడ్ దాదాపు ఏడాదిన్నర నుండి ఎలాగైనా తిరిగి కోలుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది కానీ ఫస్ట్ వేవ్ తర్వాత సెకెండ్ వేవ్ కూడా ఎదురుదెబ్బ కొట్టడం తో చేసేదేమీ లేక సినిమాలను డైరెక్ట్ గా డిజిటల్ లో రిలీజ్ చేసుకుంటూ పోతుంది. ఈ క్రమం లో మళ్ళీ థియేటర్స్ లో రిలీజ్ చేయాలనీ ధైర్యం చేస్తున్నా ఇప్పుడు ఉన్న ధైర్యం కూడా పోయేలా కలెక్షన్స్ ని సాధిస్తుంది సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ బెల్ బాటం సినిమా.

ఈ సినిమా పై భారీ ఆశలు అంచనాలను పెట్టుకున్న బాలీవుడ్ కి శాకిస్తూ తొలిరోజు నుండే కలెక్షన్స్ పరంగా తీవ్ర నిరాశని కలగజేస్తూ చిన్న చితకా సినిమాలు సాధించే రేంజ్ లో ఓపెనింగ్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటున్న ఈ సినిమా మొత్తం మీద…

3 రోజుల్లో పట్టుమని 9 కోట్లు కూడా సాధించలేని పరిస్థితి ఏర్పడగా తొలిరోజు ఈ సినిమా డిల్లీ లో మల్టీ ప్లేక్స్ లో కేవలం 3 ఎంట్రీ ఇవ్వడం తో షో వేశారట. అక్కడ పాపులర్ థియేటర్ అవ్వడం చిన్న చితకా సినిమాలకు కూడా మంచి ఆక్యుపెన్సీ ఉంటుందని కానీ పాండమిక్ తర్వాత పరిస్థితులు…

ఏ విధంగా ఉన్నాయో చెప్పడానికి ఇది నిదర్శనం అని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఫేమస్ మల్టీ ప్లేక్స్ లోనే కేవలం 3 ప్రేక్షకులు సినిమా చూడటానికి మొదటి రోజు రావడం జనలాను థియేటర్స్ కి తిరిగి రప్పించడం ఇప్పట్లో చాలా కష్టం అంటూ చెబుతున్నారు విశ్లేషకులు. ఇంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా కానీ సినిమా చూడటానికి జనాలు తిరిగి థియేటర్స్ కి…

రావడం లేదంటే మరింత టైం పట్టడం ఖాయమని బాలీవుడ్ వాళ్ళు అనుకుంటున్నారు. ఈ సినిమా రిజల్ట్ తో త్వరలో థియేటర్స్ లో సినిమాలు ప్లాన్ చేసుకున్న వాళ్ళు కూడా మరింత టైం తీసుకునే థియేటర్స్ లోకి అడుగు పెట్టాలని ఆలోచిస్తున్నారట. మొత్తం మీద బాలీవుడ్ కి ఇప్పట్లో తేరుకునే అవకాశం తక్కువగానే కనిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here