బాలీవుడ్ లో పఠాన్ మూవీ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసినా కానీ తర్వాత వచ్చిన సినిమాల పరిస్థితి మాత్రం తీవ్రంగా నిరాశ పరిచే విధంగా ఉండటం విచారకరం అని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయిన షెహజాదా సినిమా భారీ నిరాశని మిగిలించిన తర్వాత ఇప్పుడు ఆడియన్స్ ముందుకు మరో రీమేక్ వచ్చింది… అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ….
సేల్ఫీ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమాకి యావరేజ్ రేంజ్ లో టాక్ వచ్చింది. సినిమా కి మొత్తం మీద 145 కోట్ల రేంజ్ లో బడ్జెట్ పెట్టగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ పరంగా ఒక స్టార్ హీరో సినిమాకి ఇంత తక్కువ కలెక్షన్స్ ఏంటి అనిపించే రేంజ్ లో…
నిరాశ పరిచే కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. సినిమా మొదటి రోజు ఇండియా లో కేవలం 2.55 కోట్ల రేంజ్ లోపే నెట్ కలెక్షన్స్ ని అందుకుని బాలీవుడ్ మైండ్ బ్లాంక్ చేసే ఓపెనింగ్స్ ని అందుకుందని చెప్పాలి. ఇక రెండో రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర….
3.5 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సాధించే అవకాశం ఉందని అంటూ ఉండగా సినిమా బడ్జెట్ దృశ్యా చూసుకుంటే సినిమా మొదటి రోజే ఎపిక్ డిసాస్టరస్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుందని చెప్పొచ్చు. ఇక సినిమా అక్షయ్ కుమార్ ఖాతాలో మరో ఫ్లాఫ్ మూవీ గా నిలవడం ఇక ఖాయం అయిందని చెప్పాలి.