యువ సామ్రాట్ నాగచైతన్య క్లాస్ మూవీ తో మాస్ రికార్డులు సృష్టిస్తున్నాడు, టైర్ 2 హీరోలలో వన్ ఆఫ్ ది హైయెస్ట్ నాన్ థియేట్రికల్ బిజినెస్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్నాడు, రీసెంట్ టైం లో పెద్దగా ఫాం లో లేకున్నా కానీ… మజిలీ సినిమా తో సెన్సేషనల్ హిట్ కొట్టి తిరిగి జోరు అందుకున్నాడు నాగ చైతన్య. బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ సినిమా సమ్మర్ ఫస్ట్ హిట్ గా నిలవడమే కాకుండా…
బాక్స్ ఆఫీస్ దగ్గర 40 కోట్ల షేర్ మార్క్ ని మొదటి సారి నాగ చైతన్య కెరీర్ లో అందుకుని సంచలనం సృష్టించగా తర్వాత ఇప్పుడు ఫిదా తో సెన్సేషనల్ హిట్ కొట్టిన శేఖర్ కమ్ముల అండ్ సాయి పల్లవి తో కలిసి తన అప్ కమింగ్ మూవీ లవ్ స్టొరీ చేస్తున్నాడు.
ఈ సినిమా పై ఇప్పటి నుండే మంచి బజ్ ఏర్పడింది అని చెప్పాలి, శేఖర్ కమ్ముల టేకింగ్ పై ఉన్న నమ్మకం అండ్ నాగచైతన్య ప్రీవియస్ మూవీ రిజల్ట్ తో ఈ సినిమా కి మార్కెట్ లో మంచి బజ్ ఏర్పడగా నాన్ థియేట్రికల్ బిజినెస్ ఈ సినిమా కి సాలిడ్ గా జరిగింది.
టైర్ 2 హీరోల్లో కేవలం తెలుగు వర్షన్ మాత్రమె చూసుకుంటే ఏకంగా 16 కోట్ల తో దుమ్ము లేపే రేంజ్ నాన్ థియేట్రికల్ బిజినెస్ ని అందుకుంది ఈ సినిమా. అందులో స్ట్రీమింగ్ రైట్స్ కింద 6 కోట్లు అందుకందని ఇది వరకే అప్ డేట్ చేయగా… హక్కులను ఆహా యాప్ సొంతం చేసుకుంది. ఇక సినిమా శాటిలైట్ రైట్స్ ని…
స్టార్ మా 5.5 కోట్ల రేటు చెల్లించి దక్కించుకోగా హిందీ డబ్బింగ్ రైట్స్ ని 4.5 కోట్ల రేటుకి సొంతం చేసుకున్నారట. దాంతో టోటల్ రేటు 16 కోట్లు పలకగా ఇక థియేట్రికల్ బిజినెస్ మినిమమ్ 25 కోట్ల రేంజ్ కి తగ్గని విధంగా ఉండే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. ఈ ఇయర్ ఎండ్ లో రాబోతున్న ఈ సినిమా ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి..