కోలివుడ్ టాప్ హీరోలలో ఒకరైన అజిత్ కుమార్(Ajith Kumar) నటించిన కొత్త సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ(Good Bad Ugly Movie) మూవీ వరల్డ్ వైడ్ గా రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఫ్యాన్స్ నుండి ఎక్స్ లెంట్ టాక్ ను సొంతం చేసుకోగా రెగ్యులర్ ఆడియన్స్ నుండి కూడా రీసెంట్ అజిత్ మూవీస్ లో బెటర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.
ఇక సినిమాకి రిలీజ్ కి ముందు రోజు వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ తో 32 కోట్ల రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ వరల్డ్ వైడ్ గా సొంతం అవ్వగా రిలీజ్ రోజున తమిళనాడులో సెన్సేషనల్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న సినిమా…
తెలుగు రాష్ట్రాల్లో పర్వాలేదు అనిపించేలా ట్రెండ్ ను చూపించగా మొదటి రోజు ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి ఇక్కడ 1.2-1.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉండగా తమిళ్ లో మాత్రం మొదటి రోజు ఓవరాల్ గా 27-30 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను…
సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు కనుక బాగుంటే ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. ఇక కర్ణాటక, కేరళ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కూడా మంచి జోరునే చూపెడుతున్న సినిమా ఓవరాల్ గా మొదటి రోజు ఇండియాలో…
35-36 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా….ఓవర్సీస్ లో ప్రీమియర్స్ అండ్ డే 1 కలెక్షన్స్ తో 2 మిలియన్ డాలర్స్ మార్క్ రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉండటంతో వరల్డ్ వైడ్ గా సినిమా ఇప్పుడు మొదటి రోజున…
50 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు కనుక బాగుంటే ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉంది. మొత్తం మీద మరోసారి అజిత్ కుమార్ మాస్ పవర్ తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాడు. ఇక డే 1 అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.