బాక్స్ ఆఫీస్ దగ్గర కోలివుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన తల అజిత్ కుమార్(Ajith Kumar) నటించిన లేటెస్ట్ మూవీ విదాముయర్చి(Vidaamuyarchi) మూవీ తో ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రాగా సినిమాకి మొదటి రోజే మిక్సుడ్ రెస్పాన్స్ సొంతం అయ్యింది. అయినా కూడా అజిత్ స్టార్ డం హెల్ప్ తో ఓపెనింగ్స్ ను బాగానే సొంతం చేసుకున్న సినిమా..
వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి మాత్రం డ్రాప్స్ ను సొంతం చేసుకుంది కానీ ఉన్నంతలో మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకునే టైంకి బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో 70% రేంజ్ లోపు రికవరీని అయితే సొంతం చేసుకున్న సినిమా బ్రేక్ ఈవెన్ కోసం సెకెండ్ వీక్ లో చాలా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.
సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొదటి వీక్ లో 1.01 కోట్ల షేర్ ని అందుకోగా 3 కోట్ల టార్గెట్ కి చాలా దూరంలో ఆగిపోయి ఇక్కడ డబుల్ డిసాస్టర్ గా నిలిచింది. ఇక వరల్డ్ వైడ్ 6-7 రోజుల్లో సినిమా 9.63 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 4.62 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా టోటల్ గా ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే…
VidaaMuyarchi-Pattudala 7 Days Total WW Collections Approx
👉Tamilnadu – 72.40Cr
👉Telugu States – 2.28Cr
👉Karnataka – 9.30Cr
👉Kerala – 3.20Cr
👉ROI – 1.10Cr
👉Overseas – 42.65Cr***approx
Total WW collection – 130.93CR(63.97CR~ Share) Approx
(70%~ RECOVERY)
మొత్తం మీద 92 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా క్లీన్ హిట్ కోసం ఇంకా 28 కోట్లకు పైగా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక రెండో వీక్ లో సినిమా సూపర్ స్ట్రాంగ్ గా జోరు చూపించి కలెక్షన్స్ ని సాధిస్తేనే బ్రేక్ ఈవెన్ కి ఎంతో కొంత అవకాశం ఉంటుంది అని చెప్పాలి ఇప్పుడు.