Home న్యూస్ బాక్స్ ఆఫీస్ తో చిరు చెడుగుడు ఆడిన ఇంద్రకి 21 ఏళ్ళు…బిజినెస్ అండ్ కలెక్షన్స్ ఇవే!

బాక్స్ ఆఫీస్ తో చిరు చెడుగుడు ఆడిన ఇంద్రకి 21 ఏళ్ళు…బిజినెస్ అండ్ కలెక్షన్స్ ఇవే!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) చేసిన ఊరమాస్ రచ్చ ఇంద్ర(Indra Movie Completes 21 years) సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చి 20 ఏళ్ళు కంప్లీట్ చేసుకుంది… ఈ సినిమా రిలీజ్ కన్నా ముందు మెగాస్టార్ చిరంజీవి మృగరాజు, శ్రీ మంజునాథ లాంటి ఫ్లాఫ్ మూవీస్ ని అలాగే డాడీ లాంటి యావరేజ్ రిజల్ట్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న తరుణంలో ఓ మాస్ కమర్షియల్ మూవీ తో కంబ్యాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన చిరు….

అప్పటికి సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు లాంటి సినిమాలతో ఇండస్ట్రీ రికార్డ్ కొట్టిన బి గోపాల్ డైరెక్షన్ లో మొదలు పెట్టిన ఇంద్ర సినిమా మొదలు అయినప్పటి నుండి ఓ రేంజ్ లో అంచనాలను క్యారీ చేస్తూ ఉండగా సినిమా పోస్టర్స్ కానీ రిలీజ్ అయిన సాంగ్స్ కానీ…

   

సినిమా పై అంచనాలను ఓ రేంజ్ లో పెంచేశాయి. దాంతో విపరీతమైన అంచనాల నడుమ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ టైం లో ఆల్ మోస్ట్ 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించిన ఇంద్ర సినిమా రిలీజ్ అయిన మొదటి ఆటకే ఊరమాస్ బ్లాక్ బస్టర్ అనిపించే…

టాక్ ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసింది. సినిమా 123 సెంటర్స్ లో 100 రోజులు, 35 సెంటర్స్ లో 175 రోజులు బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి టోటల్ రన్ లో ఏకంగా 32 కోట్ల దాకా షేర్ ని సొంతం చేసుకుని టాలీవుడ్ తరుపున మొట్ట మొదటి 30 కోట్ల షేర్ మార్క్ ని అందుకున్న సినిమా గా సంచలన రికార్డ్ ను సొంతం చేసుకుంది.

మొత్తం మీద బిజినెస్ మీద ఆల్ మోస్ట్ 14 కోట్ల ప్రాఫిట్ ను దక్కించుకుని మరో సంచలనం కూడా సృష్టించింది ఇంద్ర సినిమా. ఈ రేంజ్ సక్సెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా రిలీజ్ అయ్యి 21 ఏళ్ళు గడవడం విశేషం. ఇప్పటికీ ఇంద్రసేనారెడ్డి బ్యాగ్రౌండ్ స్కోర్ కి గూస్ బంప్స్ రావడం ఈ సినిమా స్పెషాలిటీ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here