మెగా మేనల్లుడు సుప్రీం హీరో సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ రిపబ్లిక్ ఆడియన్స్ ముందుకు అక్టోబర్ 1 న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా మీద సాయి ధరం తేజ్ నటించిన రీసెంట్ మూవీస్ వరుస పెట్టి హిట్ అవ్వడంతో అంచనాలు పర్వాలేదు అనిపించే విధంగా ఉండగా రిపబ్లిక్ కంప్లీట్ గా సీరియస్ కథ తో సాగే దేవకట్ట మూవీ కాబట్టి సినిమా ఎక్కువగా ఇప్పుడు మౌత్ టాక్ పైన…
డిపెండ్ అయ్యి రిలీజ్ కానుంది అని చెప్పాలి. సాయి ధరం తేజ్ ఇంకా హాస్పిటల్ లో కోలుకుంటున్న నేపధ్యంలో ఈ సినిమా రిలీజ్ ను ఆపకండి అంటూ మేకర్స్ కి చెప్పడం తో డేట్ ఏమి చేంజ్ చేయకుండానే సినిమాను అక్టోబర్ 1 న రిలీజ్ చేస్తున్నారు.
ఇక సినిమాను ప్రమోట్ చేయడానికి మెగా ఫ్యామిలీ సిద్ధం అవుతుండగా సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా ట్రైలర్ లో కంటెంట్ చాలా సీరియస్ నోట్ తో సాగడంతో సినిమా రెగ్యులర్ మూవీ లా కాకుండా డిఫెరెంట్ గా అనిపించింది. ఇక ట్రైలర్ కి 24 గంటల్లో యూట్యూబ్ లో…
మొత్తం మీద మంచి రెస్పాన్స్ సొంతం అయ్యింది అని చెప్పొచ్చు. లైక్స్ పరంగా టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోల్లో సెకెండ్ బెస్ట్ అనిపించుకునే రేంజ్ లో 324.7K లైక్స్ ను సాధించి లవ్ స్టొరీ ట్రైలర్ 342K తర్వాత నిలిచి దుమ్ము దుమారం చేసింది. ఇక టాలీవుడ్ ఓవరాల్ బిగ్గెస్ట్ లైక్స్ ని అందుకున్న మూవీస్ లో టాప్ 9 ప్లేస్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా…
కానీ వ్యూస్ పరంగా 24 గంటల్లో 3.91 మిలియన్ వ్యూస్ మార్క్ ని అందుకున్న ఈ సినిమా ట్రైలర్ టాప్ మీడియం రేంజ్ మూవీస్ లో చోటు ని సొంతం చేసుకోలేదు, లైక్స్ రికార్డ్ కొట్టినా వ్యూస్ కొంచం నిరాశ పరిచాయి. అయినా కానీ సినిమా జానర్ కి ఇది మంచి రెస్పాన్స్ అనే చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా అక్టోబర్ 1 న ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.