నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి(Arjun Son Of Vyjayanthi Movie) ఆడియన్స్ ముందుకు ఈ వీకెండ్ లో గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా..సినిమా మీద ఆడియన్స్ లో మంచి అంచనాలు అయితే ఉన్నాయి అని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర…
ఏమాత్రం టాక్ బాగున్నా కూడా కలెక్షన్స్ పరంగా మంచి జోరుని సినిమా చూపించే అవకాశం ఎంతైనా ఉంటుంది అని చెప్పొచ్చు. ఇక రీసెంట్ గా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా ట్రైలర్ కి ఆడియన్స్ నుండి రెస్పాన్స్ చాలా బెటర్ గానే వచ్చింది.
తల్లి కొడుకుల సెంటిమెంట్ కాన్సెప్ట్ తో పర్ఫెక్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ట్రైలర్ లోనే చాలా వరకు కథ పాయింట్ ను రివీల్ చేయగా కమర్షియల్ ఎలిమెంట్స్ బాగానే ఉండటంతో ట్రైలర్ రేంజ్ లో సినిమా ఉంటే…
కచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా వర్కౌట్ అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక సినిమా ట్రైలర్ కి యూట్యూబ్ లో 24 గంటల్లో ఓవరాల్ గా ఎక్స్ లెంట్ రెస్పాన్స్ అయితే సొంతం అయింది అని చెప్పాలి. వ్యూస్ పరంగా 24 గంటలు పూర్తి అయ్యే టైంకి ….
9.1 మిలియన్ వ్యూస్ మార్క్ ని అందుకున్న ఈ ట్రైలర్ లైక్స్ పరంగా కూడా మంచి జోరునే చూపించి 178K లైక్స్ మార్క్ ని సొంతం చేసుకుని ఓవరాల్ గా ఎక్స్ లెంట్ గా జోరు చూపించింది. నైట్ టైంలో రిలీజ్ అవ్వడంతో మరీ రికార్డులు ఏమి నమోదు కాకపోయినా కూడా…
ఓవరాల్ గా 24 గంటల్లో మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్(NTR) కూడా రావడంతో బజ్ పెరిగిపోగా ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ ఎలాంటి రిజల్ట్ ను ఇప్పుడు సొంతం చేసుకుంటాడో చూడాలి…