అనుకున్న రేంజ్ లో బజ్ క్రియేట్ అయ్యి ఉంటే మొదటి రోజు ఊహకందని రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉన్నా కూడా ఓవరాల్ గా అజిత్ కుమార్(Ajith Kumar) నటించిన కొత్త సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ(Good Bad Ugly Movie) మూవీ అజిత్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది.
తమిళనాడులో మొదటి రోజు ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించిన సినిమా రెండో రోజు కూడా అక్కడ మంచి జోరుని చూపెడుతూ హోల్డ్ ని కొనసాగించగా తెలుగు లో మాత్రం కొంచం డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా ఇక్కడ ఓవరాల్ గా ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి…
మొత్తం మీద 70-75 లక్షల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే గ్రాస్ లెక్క కొంచం పెరిగే అవకాశం ఉంది. ఇక తమిళనాడులో ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి సినిమా 12-13 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను…
సొంతం చేసుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలను బట్టి కలెక్షన్స్ ఇంకొంచం పెరిగే అవకాశం ఉంది. ఇక కర్ణాటక, కేరళ రెస్ట్ ఆఫ్ ఇండియా లో మరో 2 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా టోటల్ గా ఇండియా లో సినిమా…
రెండో రోజు ఓవరాల్ గా 16 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా, ఓవర్సీస్ లో 1 మిలియన్ రేంజ్ కి అటూ ఇటూగా వసూళ్ళని అందుకునే అవకాశం ఉండగా ఓవరాల్ గా రెండో రోజున వరల్డ్ వైడ్ గా 22-24 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే…
అవకాశం ఉండగా, ఓవరాల్ గా రెండో రోజు సినిమా బాగానే హోల్డ్ చేసిందని చెప్పాలి. తమిళ్ అండ్ ఓవర్సీస్ లో అంచనాలను ఏమైనా మించిపోతే ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక టోటల్ గా సినిమా 2 రోజుల ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.