Home న్యూస్ 2nd డే ఆపరేషన్ వాలెంటైన్ బాక్స్ ఆఫీస్ స్టేటస్…ఏంటి సామి ఇదీ!

2nd డే ఆపరేషన్ వాలెంటైన్ బాక్స్ ఆఫీస్ స్టేటస్…ఏంటి సామి ఇదీ!

1

మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా ఏమాత్రం హోల్డ్ ని చూపించ లేక పోయిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) నటించిన లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వాలంటైన్(Operation Valentine) సినిమా తీవ్రంగా నిరాశ పరిచే స్టార్ట్ ను సొంతం చేసుకోగా రెండో రోజులో అడుగు పెట్టిన సినిమా కి…

బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం హోల్డ్ అయితే కనిపించడం లేదు అనే చెప్పాలి ఇప్పుడు, సినిమా మల్టీప్లెక్సులలో కొంచం పర్వాలేదు అనిపిస్తున్నా కూడా సింగిల్ స్క్రీన్స్, మాస్ సెంటర్స్ లో కంప్లీట్ గా చేతులు ఎత్తేసింది…రెండో రోజు ట్రాక్ చేసిన సెంటర్స్ లో డ్రాప్స్ ఉండగా సింగిల్ స్క్రీన్స్ లో బుకింగ్స్ మరింత తక్కువగా ఉన్నాయి.

బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రజెంట్ ట్రాక్ చేసిన సెంటర్స్ బుకింగ్స్ ను చూస్తూ ఉంటే రెండో రోజు సినిమా తెలుగు రాష్ట్రాల్లో 50 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు ఏమైనా బాగుంటే గ్రోత్ కొద్ది వరకు ఉండే అవకాశం ఉంది..

ఓవర్సీస్ లో కూడా సినిమా పెద్దగా జోరుని ఏమి చూపించ లేక పోతుంది, దాంతో రెండో రోజు వరల్డ్ వైడ్ గా 70 లక్షల నుండి 75 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది, అది కూడా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటేనే సాధ్యం, కానీ సినిమా అందుకోవాల్సిన టార్గెట్….

దృశ్యా చూసుకుంటే అసలు ఈ కలెక్షన్స్ ఏమాత్రం టార్గెట్ దిశగా అయితే వెళ్ళడం లేదు అనే చెప్పాలి. ఏదైనా అద్బుతం జరిగితే తప్ప సినిమా తేరుకునే అవకాశం కనిపించడం లేదు, ఇక టోటల్ గా సినిమా 2 రోజుల్లో ఓవరాల్ గా సాధించే కలెక్షన్స్ లెక్క ఎలా ఉంటుందో చూడాలి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here