ఫస్ట్ వేవ్ తర్వాత టాలీవుడ్ లో వరుస పెట్టి సినిమాలు ఆడియన్స్ ముందుకు వచ్చాయి కానీ అప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా సంక్రాంతి నుండే కలెక్షన్స్ జాతర మొదలయింది. ఆ జాతర సమ్మర్ దాకా కొనసాగగా తర్వాత సెకెండ్ వేవ్ అండ్ ఆంధ్రలో టికెట్ రేట్లు తగ్గడం కలెక్షన్స్ పై ఇంపాక్ట్ చూపి సెకెండ్ వేవ్ తర్వాత థియేటర్స్ తెరచుకున్న పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వాలి అంటే బయపడ్డ టైం లో…
నాగ చైతన్య నటించిన క్రేజీ మూవీ లవ్ స్టొరీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో సెకెండ్ వేవ్ తర్వాత టాలీవుడ్ నుండి హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాగా సంచలనం సృష్టించింది. ఆ సినిమా టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైం కి..
బాక్స్ ఆఫీస్ దగ్గర 35.08 కోట్ల షేర్ ని అందుకుని సూపర్ హిట్ గా నిలిచింది, ఆల్ మోస్ట్ రెండు నెలలకు పైగా సెకెండ్ వేవ్ తర్వాత టాప్ లో ఉన్న ఈ సినిమా కలెక్షన్స్ ని ఇప్పుడు మూడు రోజుల్లోనే బ్రేక్ చేసి నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ అఖండ దుమ్ము లేపింది.
మూడు రోజులు పూర్తీ అయ్యే టైం కి టోటల్ వరల్డ్ వైడ్ గా 35.4 కోట్ల షేర్ మార్క్ ని అందుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు సెకెండ్ వేవ్ తర్వాత హైయెస్ట్ కలెక్షన్స్ ను టాలీవుడ్ నుండి సొంతం చేసుకున్న సినిమాగా నంబర్ ప్లేస్ లో నిలిచింది. మూడు రోజుల్లోనే నంబర్ 1 ప్లేస్ ను సొంతం చేసుకున్న అఖండ సినిమా ఇప్పుడు…
పుష్ప బరిలోకి దిగే వరకు నంబర్ 1 ప్లేస్ ను ఎంజాయ్ చేయబోతుంది అని చెప్పాలి. ఇక సెకెండ్ వేవ్ తర్వాతే కాదు ఓవరాల్ గా ఈ ఇయర్ లో కూడా వన్ ఆఫ్ ది హైయెస్ట్ షేర్ ని సొంతం చేసుకున్న సినిమాల పరంగా కూడా టాప్ 5 లో ఒకటిగా ఎంటర్ అయిన అఖండ టోటల్ రన్ లో ఎంత దూరం వెళుతుంది అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది అని చెప్పాలి.