మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ చిత్రలహరి మరియు ప్రతిరోజూ పండగే లాంటి రెండు బాక్ టు బాక్ హిట్స్ తర్వాత చేస్తున్న సినిమా సోలో బ్రతుకే సో బెటర్ సమ్మర్ రేసు లోనే నిలవాల్సి ఉన్నా కరోనా వలన అది కుదరక డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అనుకున్నా రేటు సెట్ కాక ఫైనల్ గా థియేటర్స్ లోనే పరుగును మొదలు పెట్టాలని డిసైడ్ అయ్యి ఈనెల 25 న సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా కి సంభందించిన అన్ని హక్కులను ఏకంగా 38 కోట్ల భారీ రేటు చెల్లించి జీ నెట్ వర్క్ వాళ్ళు సొంతం చేసుకోగా రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమాను కుదిరితే సొంతంగా లేదా వేరే వాళ్లకి అమ్మాలి అని డిసైడ్ అవ్వగా….
రీసెంట్ గా సినిమా రెండు తెలుగు రాష్ట్రాల హక్కులను దిల్ రాజు మరియు యు వి క్రియేషన్స్ వాళ్లకి షాకింగ్ లో రేటు కి అమ్మేశారు. సాయి ధరం తేజ్ రీసెంట్ మూవీస్ బిజినెస్ రెండు తెలుగు రాష్ట్రాలలో 16-18 కోట్ల రేంజ్ లో ఉండగా ఈ సినిమా హక్కులు మాత్రం…
8 కోట్ల రేటుకే అమ్మి షాక్ ఇచ్చారు, 50% ఆక్యుపెన్సీ రూల్ ఉండటం జనాలు థియేటర్స్ కి వస్తారో రారో అన్న డౌట్ కూడా ఉండటం తో సేఫ్ సైడ్ లో తక్కువ రేటుకే సినిమా ను అమ్మగా సినిమాను కొద్ది గ్యాప్ తోనే జీ 5 యాప్ లో కూడా డిజిటల్ రిలీజ్ చేయబోతున్నారని అందుకనే తక్కువ రేటు కి అమ్మారు అంటూ…..
ఇప్పుడు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. మొత్తం మీద ఈ లో రేటు కొంచం షాకింగ్ గా ఉన్నప్పటికీ సంక్రాంతి సినిమాలు వచ్చే వరకు పోటి ఉండదు కాబట్టి రెండు వారాలకు పైగా సోలో రన్ ని సొంతం చేసుకోబోతున్న ఈ సినిమా అవలీలగా తెలుగు రాష్ట్రాలలో బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు.