టాలీవుడ్ మాస్ డైరెక్టర్స్ లో ఒకరైన గోపీచంద్ డైరెక్షన్ లో బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్(Sunny Deol) తో చేసిన భారీ బడ్జెట్ మూవీ జాట్(Jaat Movie) ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి బాలీవుడ్ మాస్ ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ సొంతం అవ్వగా కలెక్షన్స్ పరంగా కూడా…
అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కుమ్మేస్తూ దూసుకు పోతున్న సినిమా రెండో రోజు వర్కింగ్ డే వలన కొంచం స్లో డౌన్ అయినా కూడా మూడో రోజు మళ్ళీ వీకెండ్ అడ్వాంటేజ్ తో మంచి జోరు ని చూపించింది…అనుకున్న అంచనాలను మించిపోతూ…
మొదటి రోజుకి మించి బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు కుమ్మేసిన సినిమా ఓవరాల్ గా మూడో రోజు 9.95 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని ఎక్స్ లెంట్ గా హోల్డ్ ని చూపించడం విశేషం అని చెప్పాలి. మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు…
మూడు రోజులు పూర్తి అయ్యే టైంకి 26.57 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపెడుతూ ఉండగా హిందీ లో సినిమా ఓవరాల్ గా 100 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని కనుక అందుకుంటే క్లీన్ హిట్ అవుతుంది..
సినిమా ఇక నాలుగో రోజు మూడో రోజు కన్నా కూడా బెటర్ గా ట్రెండ్ ను చూపెడుతూ ఉండటంతో ఈ రోజు కలెక్షన్స్ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉంది. ఇక లాంగ్ రన్ లో సినిమా 100 కోట్ల మార్క్ ని అందుకుంటుందో లేదో వర్కింగ్ డేస్ హోల్డ్ ని బట్టి తెలుస్తుంది…