Home గాసిప్స్ 45 కోట్ల సినిమా…సడెన్ గా ఈ నిర్ణయం ఏంటి సామి!

45 కోట్ల సినిమా…సడెన్ గా ఈ నిర్ణయం ఏంటి సామి!

4831
0

పటాస్ సినిమా తో చాలా కాలానికి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ తర్వాత మళ్ళీ వరుస ఫ్లాఫ్స్ ఇబ్బంది పెట్టిన టైం లో 118 సినిమా తో ఎక్స్ పెరి మెంట్ చేసి మరీ హిట్ ను సొంతం చేసుకున్నాడు. కానీ తర్వాత చేసిన ఎంత మంచి వాడవురా మళ్ళీ బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకోగా మళ్ళీ కళ్యాణ్ రామ్…

కొత్త సినిమా ఏది ఆడియన్స్ ముందుకు రాలేదు, కొన్ని సినిమాల అనౌన్స్ మెంట్ లు జరగా వాటిలో మైతలాజికల్ కాన్సెప్ట్ తో భారీ గ్రాఫిక్స్ హంగులతో ఆల్ మోస్ట్ 45కోట్ల రేంజ్ బడ్జెట్ లో రూపొందింది అని చెబుతున్న బింబిసార అనే భారీ సినిమాను చేస్తున్నట్లు చెప్పగా అప్పట్లో సినిమా మోషన్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేయగా…

ఆడియన్స్ నుండి అద్బుతమైన రెస్పాన్స్ ను ఈ మోషన్ పోస్టర్ సొంతం చేసుకోగా సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉండగా ఇప్పుడు సినిమా రిలీజ్ డేట్ పై ఇండస్ట్రీలో హాట్ టాపిక్ నడుస్తుంది. టైటిల్ అనౌన్స్ మెంట్ తర్వాత సినిమా నుండి ఒక్క అప్ డేట్ కూడా ఇప్పటి వరకు రాలేదు…

కానీ ఇప్పుడు సడెన్ గా సినిమా ఆడియన్స్ ముందుకు ఈ క్రిస్టమస్ కానుకగా రిలీజ్ చేయాలనీ సన్నాహాలు చేస్తున్నారని టాక్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. కానీ క్రిస్టమస్ కి ఆల్ రెడీ నాని శ్యామ్ సింగ రాయ్ ని, వరుణ్ తేజ్ గని సినిమాలను అనౌన్స్ చేశారు. ఇప్పుడు కళ్యాణ్ రామ్ బింబిసార కూడా అదే రోజున వస్తుంది అంటూ జోరుగా…

ప్రచారం అయితే జరుగుతుంది కానీ మేకర్స్ నుండి ఇప్పటి వరకు అయితే ఎలాంటి అప్ డేట్ లేదు, ఒకవేళ కన్ఫాం అయితే మట్టుకు మినీ సంక్రాంతి పోటి క్రిస్టమస్ 24న జరగబోయే అవకాశం ఉందని చెప్పాలి. ఈ మూడు సినిమాలకు తోడూ ఒక వారం ముందు పుష్ప కూడా ఉంది కాబట్టి థియేటర్ సమస్యలు భారీగా ఉండే అవకాశం ఉంటుంది. మరి ఫైనల్ గా ఏమవుతుందో చూడాలి ఇక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here