Home న్యూస్ రికార్డ్ ట్రెండ్ తో బాలయ్య ఫ్యాన్స్ రచ్చ…ఇండస్ట్రీలో బాలయ్య అడుగు పెట్టి 46 ఏళ్ళు!!

రికార్డ్ ట్రెండ్ తో బాలయ్య ఫ్యాన్స్ రచ్చ…ఇండస్ట్రీలో బాలయ్య అడుగు పెట్టి 46 ఏళ్ళు!!

584
0

మాస్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరోల్లో నట సింహం బాలయ్య కూడా ఒకరు, టాలీవుడ్ లో మాస్ మూవీస్ తో ఇండస్ట్రీ రికార్డుల బెండు తీసిన బాలయ్య ఒక్క మాస్ కే పరిమితం కాకుండా ప్రయోగాలు, క్లాస్ మూవీస్, పౌరాణికాలు, జానపద సినిమాలు హిస్టారికల్ మూవీస్ తో పాటు లేటెస్ట్ ఎన్టీఆర్ బయోపిక్ సిరీస్ లో కూడా నటించి కంప్లీట్ యాక్టర్ గా మరింత పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే.

బాలయ్య టాలీవుడ్ లో అడుగు పెట్టి నేటితో 46 ఏళ్ళు పూర్తి అయింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా తాతమ్మ కథతో సినిమా తో తెరంగేట్రం చేసిన బాలయ్య తనకంటూ గుర్తుంపు ని తక్కువ టైం లోనే సొంతం చేసుకున్నాడు. మంగమ్మ గారి మనవడు సినిమాతో సెన్సేషనల్ హిట్ కొట్టి ఇక…

వెను తిరిగి చూసుకోకుండా కెరీర్ ని కొనసాగించిన బాలయ్య బొబ్బిలి సింహం, రౌడీ ఇన్స్ పెక్టర్, ముద్దుల మావయ్య, భైరవ ద్వీపం, ఆదిత్య 369, సమర సింహా రెడ్డి, నరసింహా నాయుడు, సింహా, లెజెండ్, గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి ఎన్నో ఎన్నోన్నో సెన్సేషనల్ హిట్స్ తో దుమ్ము లేపాడు.

అలాంటి బాలయ్య టాలీవుడ్ లో అడుగు పెట్టి 46 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా సోషల్ మీడియా లో అభిమానులు భారీ ఎత్తున ట్రెండ్ చేయడం మొదలు పెట్టగా భారీ రికార్డులతో దుమ్ము లేపిన అభిమానులు సీనియర్స్ యానివర్సరీ ట్రెండ్స్ లో కొత్త రికార్డ్ ను నమోదు చేయగా ఓవరాల్ గా టాలీవుడ్ బిగ్గెస్ట్ యాక్టర్స్ యానివర్సరీ ట్రెండ్స్ లో….

టాప్ 2 ప్లేస్ తో దుమ్ము దుమారం చేశారు. ఒకసారి టాలీవుడ్ బిగ్గెస్ట్ యాక్టర్స్ యానివర్సరీ ట్రెండ్స్ ని గమనిస్తే
👉#17VictoriousYrsOfAlluArjun- 1.7M
👉#46GloriousYearsOfNBK – 900.1K****
👉#39YearsForTriumphSSMBinTFI- 590K
👉#19YrsOfSovereignNTR- 575K
👉#18YrsOfTorchBearerNTR- 422K
👉#12GloriousYearsOfRAMCHARAN- 258K
👉#21YearsOfPawankalyan- 200k
46 ఏళ్ళు ఇండస్ట్రీలో పూర్తి చేసుకున్న బాలయ్య ఇప్పుడు బోయపాటి డైరెక్షన్ లో చేస్తున్న అప్ కమింగ్ మూవీ తో మళ్ళీ రికార్డులు తిరగ రాయాలని చూస్తున్నాడు.. ఈ సినిమా వచ్చే ఇయర్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here