బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా టైం తర్వాత అల్టిమేట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ అజిత్ కుమార్(Ajith Kumar) నటించిన కొత్త సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ(Good Bad Ugly Movie) మూవీతో సంచలన ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండగా సినిమా మూడు రోజుల్లోనే 48% రేంజ్ లో రికవరీని…
సొంతం చేసుకుని కుమ్మేసిన తర్వాత ఇప్పుడు 4వ రోజున సండే అడ్వాంటేజ్ తో మరోసారి మేజర్ సెంటర్స్ లో అంచనాలను మించి మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం. తెలుగు లో పెద్దగా గ్రోత్ లేదు కానీ మరోసారి మూడో రోజు లెవల్ లో..
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెర్ఫార్మ్ చేస్తూ ఉండగా మొత్తం మీద నాలుగో రోజున తెలుగు రాష్ట్రాల్లో 85-90 లక్షల రేంజ్ లో గ్రాస్ ను వసూల్ చేసే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ ఇంకొంచం పెరిగే అవకాశం ఉంది.
ఇక సినిమా తమిళ్ లో ఈ రోజు రిమార్కబుల్ ట్రెండ్ ను చూపెడుతూ ఉండగా మూడో రోజు మీద కూడా గ్రోత్ ని చూపెడుతూ ఉండటంతో 19-20 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను ఈ రోజు అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ లెక్కలు బాగుంటే ఈ లెక్క మరికొంత పెరిగే అవకాశం కూడా ఉంది.
ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లలో కూడా ఎక్స్ లెంట్ గా జోరు ని చూపెడుతున్న సినిమా ఓవరాల్ గా నాలుగో రోజున వరల్డ్ వైడ్ గా 33-35 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు..
ఇక ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అన్ని చోట్లా అంచనాలను మించిపోతే ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి….ఓవరాల్ గా అజిత్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ తో వీర కుమ్ముడు కుమ్ముతున్న సినిమా ఇప్పుడు 4 రోజుల్లో అఫీషియల్ గా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.