Home న్యూస్ లెక్క 50 పైనే….మాస్ ఊచకోత కోసిన అజిత్ కుమార్!!

లెక్క 50 పైనే….మాస్ ఊచకోత కోసిన అజిత్ కుమార్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ ఆల్ రెడీ విదామయుర్చి లాంటి లో బజ్ ఉన్న మూవీతోనే సెన్సేషనల్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్న కోలివుడ్ టాప్ హీరోలలో ఒకరైన అజిత్ కుమార్(Ajith Kumar) నటించిన కొత్త సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ(Good Bad Ugly Movie) మూవీతో రీసెంట్ గా రాగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

తమిళ్ వర్షన్ మంచి రివ్యూలను సొంతం చేసుకోగా వింటేజ్ అజిత్ కుమార్ ని బాగా చూపించారు అంటూ ఓ రేంజ్ లో మెచ్చుకుంటూ ఉండగా మిగిలిన చోట్ల మాత్రం పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా ఇక కలెక్షన్స్ పరంగా సినిమా మొదటి రోజున..

అనుకున్న అంచనాలను మించి పోయే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. తమిళ్ లో మొదటి రోజున 26-28 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోబోతూ ఉండగా రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద మరో 5-6 కోట్ల రేంజ్ లో గ్రాస్ కన్ఫాం గా కనిపిస్తూ ఉంది…

ఓవర్సీస్ లో 2 మిలియన్ డాలర్స్ మార్క్ కి అటూ ఇటూగా ఓపెనింగ్స్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉండటంతో మొదటి రోజున ఇప్పుడు వరల్డ్ వైడ్ గా సినిమా 50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా…

అన్ని చోట్లా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు అంచనాలను మించితే 50-52 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను సినిమా సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా అజిత్ కుమార్ కెరీర్ లోనే ఆల్ టైం బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోబోతుంది. టాక్ ఎలానూ బాగానే ఉండటంతో లాంగ్ వీకెండ్ లో సినిమా మంచి జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here