విక్టరీ వెంకటేష్ నాగ చైతన్య ల లేటెస్ట్ మూవీ వెంకి మామ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి 3 రోజుల్లో సాలిడ్ కలెక్షన్స్ ని సాధించింది. కానీ వర్కింగ్ డే లో అనుకున్న రేంజ్ లో హోల్డ్ చేయడం లో కొద్దిలో సినిమా విఫలం అయింది, ఇక 5 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది అన్నది ఆసక్తిగా మారగా… సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు కొద్దిగా తగ్గింది.
దానికి కారణం ఫ్యామిలీ ఆడియన్స్ వర్కింగ్ డేస్ లో సినిమాలు ప్రిఫర్ చేయక పోవడమే, దాంతో టోటల్ గా యూత్ పైనే డిపెండ్ అవ్వడం తో కలెక్షన్స్ సినిమా కి వర్కింగ్ డేస్ లో ఆశించిన మేర రావడం లేదు. సినిమా 5 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో…
తొలి 2 షోలకు 4 వ రోజు తో పోల్చితే 40% కి పైగా డ్రాప్స్ ని సొంతం చేసుకుంది, ఈవినింగ్ అండ్ నైట్ షోలలో తిరిగి 5% వరకు ఇంప్రూవ్ మెంట్ ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో కనిపించాయి కానీ అవి మరీ అనుకున్న రేంజ్ లో అయితే లేవు. దాంతో ఈ రోజు సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో..
1.5 కోట్ల నుండి 1.7 కోట్ల రేంజ్ లో షేర్ ని వసూల్ చేసే అవకాశం ఉంది, ఇది మంచి కలెక్షన్స్ అయినా కానీ సినిమా కి ఈ వారం 4 సినిమాల నుండి పోటి ఉండటం తో మొదటి వారంలోనే ఎంత కుదిరితే అంత వెనక్కి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా…
5 వ రోజున 2 కోట్ల కి అటూ ఇటూ గా కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంది, మొత్తం మీద సినిమా కి ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ ఉన్నప్పటికీ అది వర్కింగ్ డేస్ లో భారీ లెవల్ లో లేకపోవడం తో కొద్దిగా షాక్ లు ఇస్తుంది సినిమా… కానీ సినిమా కి సెకెండ్ వీక్ లో బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పొచ్చు.