బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజే మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకున్నా కూడా వీకెండ్ వరకు సాలిడ్ కలెక్షన్స్ తో కుమ్మేసిన కోలివుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన తల అజిత్ కుమార్(Ajith Kumar) నటించిన లేటెస్ట్ మూవీ విదాముయర్చి(Vidaamuyarchi) మూవీ నాలుగు రోజుల వీకెండ్ లో 61% రేంజ్ లో రికవరీనమి సొంతం చేసుకుని పర్వాలేదు అనిపించగా…
బాక్స్ ఆఫీస్ దగ్గర 5వ రోజు నుండి ఫుల్ వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టిన సినిమా, వీకెండ్ లో చూపించిన జోరు చూసి డీసెంట్ లెవల్ లో హోల్డ్ ని చూపిస్తుంది ఏమో అని అనుకున్నా కూడా అనుకున్న దాని కన్నా కూడా సినిమా అన్ని చోట్లా హెవీ గానే డ్రాప్స్ ను సొంతం చేసుకుంది ఇప్పుడు…
సండే తో పోల్చితే మండే టోటల్ గా 80% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుంది ట్రాక్ చేసిన సెంటర్స్ లో, దాంతో సినిమా ఫేట్ ఇక డిసైడ్ అవుతుంది అని చెప్పొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో షేర్ పెద్దగా వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఇక తమిళనాడులో సినిమా ఈ రోజు అటూ ఇటూగా…
2-2.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే గ్రాస్ కొంచం పెరిగే అవకాశం ఉంది, ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లలో కూడా డ్రాప్స్ గట్టిగానే ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు…
4.5-5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద 5వ రోజున సినిమా అనుకున్న దాని కన్నా కూడా ఎక్కువ గానే డ్రాప్స్ ను సొంతం చేసుకోబోతుంది ఇప్పుడు. ఇక టోటల్ గా 5 రోజుల కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.