Home న్యూస్ 6.57-356.5…..అల్లకల్లోలం చేసిన పుష్పరాజ్!

6.57-356.5…..అల్లకల్లోలం చేసిన పుష్పరాజ్!

753
0

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ ల కాంబోలో వస్తున్న హాట్రిక్ మూవీ పుష్ప పాన్ ఇండియా లెవల్ లో భారీ ఎత్తున డిసెంబర్ 17న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా ఆడియన్స్ లో ఆల్ రెడీ సాలిడ్ బజ్ ని క్రియేట్ చేయగా మాస్ లో ఓ రేంజ్ లో రీచ్ ని దక్కించుకున్న ఈ సినిమా ఒక్కో సాంగ్ తో రచ్చ ఇంకా పెరుగుతూనే వెళుతుంది అని చెప్పాలి.

రీసెంట్ గా సినిమాలోని మరో మాస్ సాంగ్ ని రిలీజ్ చేశారు, ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా అంటూ లిరిక్ తో సాగిన ఈ మాస్ నంబర్ సినిమాలో నాలుగో సాంగ్ గా ఆడియన్స్ ముందుకు రాగా సాంగ్ కి 24 గంటల్లో సాలిడ్ రెస్పాన్స్ సొంతం అయ్యింది. టోటల్ గా 24 గంటల్లో కొత్త రికార్డులు ఏమి క్రియేట్ చేయకపోయినా కానీ..

4 వ సాంగ్ కి కూడా 24 గంటలలో 6.57 మిలియన్ వ్యూస్ ని 356.5K లైక్స్ ని అందుకుని సాలిడ్ రెస్పాన్స్ తో అల్లకల్లోలం చేయగా వ్యూస్ పరంగా ఆల్ టైం టాప్ 9 ప్లేస్ ను లైక్స్ పరంగా ఆల్ టైం టాప్ 10 ప్లేస్ ను అందుకుంది, ఇతర సినిమాలలో 4 వ సాంగ్ ఇలాంటి రెస్పాన్స్ రావడం ఈ సినిమాకే చెల్లింది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here