Home Uncategorized డిసాస్టర్ బొమ్మ…8 రోజులు టాప్ 3…సెన్సేషన్ ఇది!

డిసాస్టర్ బొమ్మ…8 రోజులు టాప్ 3…సెన్సేషన్ ఇది!

1483
0

బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ అయిన సినిమాలు అన్నీ ఆడియన్స్ ని ఇక అలరించలేవు అనుకుంటే తప్పే అవుతుంది, చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకున్నా కానీ తిరిగి టెలివిజన్ లోనో లేక డిజిటల్ లోనో మంచి వ్యూవర్ షిప్ ను TRP రేటింగ్ లను సొంతం చేసుకుంటూ ఉంటాయి. ఇప్పుడు లేటెస్ట్ గా యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన ఓల్డ్ మూవీ…

ఆరడుగుల బుల్లెట్ సినిమా విషయంలో ఇదే జరుగుతుంది. సినిమా ఆడియన్స్ ముందుకు ఎప్పుడో 4 ఏళ్ల క్రితమే రిలీజ్ అవ్వాల్సింది కానీ అనుకోని ఇబ్బందుల వలన ఎప్పటి కప్పుడు చివరి నిమిషంలో రిలీజ్ ఆగిపోతూ వచ్చి ఈ ఏడాది సీటిమార్ తో గోపీచంద్ కంబ్యాక్ కొట్టిన తర్వాత….

థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకున్నా అనుకున్న రేంజ్ లో పెర్ఫార్మ్ చేయలేక పోయిన ఈ సినిమా ఓవరాల్ గా డిసాస్టర్ గానే పరుగును ముగించింది, కానీ రీసెంట్ గా సినిమా అమెజాన్ ప్రైమ్ లో డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకోగా సాలిడ్ వ్యూవర్ షిప్ తో అక్కడ ఈ సినిమా…

దుమ్ము దుమారం లేపేలా దూసుకు పోతుందని సమాచారం. ప్రైమ్ వీడియోలో సినిమా రిలీజ్ అయ్యి ఆల్ మోస్ట్ వారానికి పైగానే అవుతున్నా కానీ ఇప్పటికీ టాప్ 2-3 ప్లేసులలో మారుతూ ట్రెండ్ అవుతూ దూసుకు పోతుంది ఈ సినిమా, ఈ సినిమా డిజిటల్ రేటుని తక్కువ రేటే చెల్లించి అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది అంటున్నారు. ఆ రేటు కి సినిమా అద్వితీయంగా ఇప్పుడు వ్యూవర్ షిప్ ను…

సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది అని చెబుతూ ఉండటం విశేషం అనే చెప్పాలి. ఇప్పటికీ టాప్ 3 ప్లేసులలో ట్రెండ్ అవుతున్న ఈ సినిమా పెట్టిన రేటు కి సాలిడ్ గా న్యాయం చేసే వ్యూస్ ని అందుకుందని అంటున్నారు. ఈ నెల ఎండ్ టైం కి సినిమా డిజిటల్ రేటు అండ్ ప్రైమ్ వీడియో వ్యూస్ లెక్కలు మరింత క్లారిటీగా రిలీజ్ అవుతాయి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here