బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో సెన్సేషనల్ రన్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న అజిత్ కుమార్(Ajith Kumar) నటించిన కొత్త సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ(Good Bad Ugly Movie) మూవీ 5 రోజుల లాంగ్ ఎక్స్ టెండెడ్ వీకెండ్ లో రిమార్కబుల్ జోరు ని చూపించి సాలిడ్ రికవరీని సొంతం చేసుకోగా…
ఇప్పుడు 6వ రోజున ఫుల్ వర్కింగ్ డే టెస్ట్ లోకి ఎంటర్ అయిన ఓవరాల్ గా 5వ రోజుతో పోల్చితే సినిమా ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో 60% రేంజ్ లో డ్రాప్స్ ను అయితే సొంతం చేసుకోగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో కూడా ఈ డ్రాప్స్ కనిపిస్తూ ఉండగా…
మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఈ రోజు 25-30 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం పెరిగే అవకాశం ఉంది. ఇక తమిళనాడులో సినిమా ఉన్నంతలో మంచి హోల్డ్ ని చూపెడుతూ ఉండగా…
ఓవరాల్ గా 6వ రోజున తమిళనాడులో ఓవరాల్ గా 5-6 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక కర్ణాటక కేరళ మరియు ఓవర్సీస్ లలో కూడా పర్వాలేదు అనిపిస్తూ..
జోరు చూపెడుతున్న సినిమా ఇప్పుడు టోటల్ వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర 10 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఓవర్సీస్ లో ట్యూస్ ఆఫర్స్ సరిగ్గా వర్కౌట్ అయితే ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉంది.
సినిమా మొత్తం మీద 6వ రోజున వరల్డ్ వైడ్ గా 12 కోట్లు ఆ పైన కనుక కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటే వర్కింగ్ డే లో రిమార్కబుల్ హోల్డ్ ని చూపించిందని చెప్పొచ్చు. ఇక మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 6 రోజుల్లో సాధించే కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.