సూపర్ స్టార్ రజినీకాంత్ దర్బార్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారాన్ని పూర్తీ చేసుకుంది, సినిమా తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు భారీ లెవల్ లో ఓపెన్ అయినా కానీ తర్వాత నుండి కొత్త సినిమాల పోటి వలన సినిమా మిగిలిన సినిమాలకు పోటి ఇవ్వలేక పోయింది, ఉన్నంతలో ఆ సినిమాలకు టికెట్స్ దక్కని వాళ్ళు ఈ సినిమా కి వెళ్ళడం మొదలు పెట్టారు. దాంతో కలెక్షన్స్ తగ్గినా డీసెంట్ గా వచ్చాయి.
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 7 వ రోజున రెండు తెలుగు రాష్ట్రాలలో 45 లక్షల రేంజ్ లో షేర్ ని రాబడుతుంది అనుకున్నా 59 లక్షల రేంజ్ లో షేర్ ని వసూల్ చేసి కొద్దిగా గ్రోత్ ని చూపింది. సినిమా మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో మొదటి వారానికి గాను..
సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ ఇలా ఉన్నాయి..
?Nizam: 4.51Cr
?Ceeded: 1.01Cr
?UA: 96L
?East: 59L
?West: 40L
?Guntur: 65L
?Krishna: 48L
?Nellore: 35L
AP-TG Total:- 8.95CR(16.60Cr Gross)?
ఇదీ మొత్తం మీద సినిమా ఫస్ట్ వీక్ తెలుగు కలెక్షన్స్ లెక్కలు.
సినిమాను తెలుగు లో 14.2 కోట్లకు అమ్మగా సినిమా 15 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది, కాగా సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 6.05 కోట్ల షేర్ ని అందుకుంటే బ్రేక్ ఈవెన్ అవుతుంది, ప్రస్తుతం పోటి లో అది చాలా కష్టంగానే కనిపిస్తుంది అని చెప్పాలి. ఈ మార్క్ ని అందుకోవాలి అంటే రెండో వీక్ లో భారీ గా హోల్డ్ చేయాలి.
ఇక సినిమా మొదటి వారం తమిళ్ తో కలిపి టోటల్ వరల్డ్ వైడ్ గా 164 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని వసూల్ చేసిందని అంచనా వేస్తున్నారు. కాగా వరల్డ్ వైడ్ గా సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే 280 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని అందుకోవాలి. అంటే రెండో వారం కూడా చాలా గట్టిగా హోల్డ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది…