Home న్యూస్ 700 కోట్ల సింహాసనంపై ఛావా….రికార్డులు అన్నీ చెల్లాచెదురు!!

700 కోట్ల సింహాసనంపై ఛావా….రికార్డులు అన్నీ చెల్లాచెదురు!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఫిబ్రవరి లాంటి అన్ సీజన్ లో ఊహకందని కలెక్షన్స్ తో అన్ని చోట్లా ఊహకందని రాంపెజ్ ను చూపెడుతూ దూసుకుపోతున్న విక్కీ కౌశల్(Vicky Kaushal) నటించిన లేటెస్ట్ మూవీ ఛావా(Chhaava) సినిమా, అల్టిమేట్ కలెక్షన్స్ తో సెన్సేషనల్ లాంగ్ రన్ ను దక్కించుకుంటూ ఉండగా… 

బాలీవుడ్ లో హిస్టారికల్ జానర్ లో ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ఉండగా….సినిమా నాలుగో వీకెండ్ లో కూడా కొత్త సినిమాల నుండి పోటి ఉన్నా కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దుమ్ము లేపుతూ ఉండగా…

24 రోజులు పూర్తి అయ్యే టైంకి సినిమా వరల్డ్ వైడ్ గా ఏకంగా 700 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించడం విశేషం. ఇండియాలో ఆల్ రెడీ 500 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని దాటేసి 600 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ వైపు…

పరుగులు పెడుతున్న ఛావా సినిమా ఓవర్సీస్ లో 90 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని కూడా అందుకుని సంచలనం సృష్టించగా…వరల్డ్ వైడ్ గా 700 కోట్ల మార్క్ ని దాటేసిన సినిమా ఫైనల్ రన్ లో అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇప్పుడు 780-800 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను…

ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా అందుకునే అవకాశం ఎంతైనా ఉంది. తెలుగు కలెక్షన్స్ లో మరింత హెల్ప్ సినిమాకి ఉండే అవకాశం ఉండటంతో ఈ మార్క్ ని దాటే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఇక హిస్టారికల్ జానర్ లో ఈ సినిమా సృష్టించిన రికార్డులు చాలా టైం బాలీవుడ్ లో అలానే ఉండే అవకాశం ఉంటుందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here