విజన్ సినిమాస్ బ్యానర్‌పై నాగం తిరుపతి రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ‘తీస్ మార్ ఖాన్’ సినిమా నిర్మిస్తున్నారు. ‘నాటకం’ ఫేమ్ కళ్యాణ్ జి గోగణ దర్శకత్వం వహిస్తున్నారు. RX 100 సినిమాతో యువతను ఆకట్టుకున్న పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటిస్తోంది. సునీల్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ గ్లాన్స్ ఆది సాయి కుమార్ బర్త్ డే కానుకగా రిలీజ్ చేయగా.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకుంది.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ మూవీ తాజాగా డబ్బింగ్ పనులు మొదలు పెట్టేసింది. అతిత్వరలో మిగితా వర్క్స్ కూడా ఫినిష్ చేసి వీలైనంత తొందర్లో సినిమాను ప్రేక్షకుల ముందుంచాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీలో ఆది సాయికుమార్ పవర్ ప్యాక్డ్ లుక్‌లో కనిపించనున్నారని ఇప్పటివరకు విడుదలైన అప్డేట్స్ ద్వారా కన్ఫర్మ్ అయింది. సాయి కార్తీక్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ సినిమాలో హైలైట్ కానున్నాయట. అతి త్వరలో ఈ మూవీ విడుదల తేదీ ప్రకటించనున్నారు దర్శకనిర్మాతలు.
కాస్ట్: ఆది సాయికుమార్, పాయల్ రాజ్‌పుత్, సునీల్ , అనూప్ సింగ్ ఠాకూర్, కబీర్ సింగ్, పూర్ణ
సాంకేతిక నిపుణులు
బ్యానర్ : విజన్ సినిమాస్
డైరెక్టర్ : కళ్యాణ్ జి గోగణ
ప్రొడ్యూసర్ : నాగం తిరుపతి రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : తిర్మల్ రెడ్డి యాళ్ళ
మ్యూజిక్ : సాయి కార్తీక్
ఎడిటర్ : మణికాంత్
సినిమాటోగ్రాఫర్: బాల్ రెడ్డి
పీఆర్.ఒ : సాయి సతీష్, పర్వతనేని రాంబాబు