Home న్యూస్ ఆదికేశవ రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

ఆదికేశవ రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

0

ఉప్పెన(Uppena) మూవీతో సంచనల విజయాన్ని సొంతం చేసుకున్న పంజా వైష్ణవ్ తేజ్(Panja Vaishnav Tej) ఆ తర్వాత చేసిన 2 సినిమాలు కొండపోలం మరియు రంగ రంగ వైభవంగా సినిమాలతో అంచనాలను అందుకోలేక పోయాడు…ఇలాంటి టైంలో ఇప్పుడు ఆడియన్స్ ముందుకు తన కొత్త సినిమా ఆదికేశవ(Aadi Keshava Movie) తో వచ్చిన వైష్ణవ్ తేజ్ ఎంతవరకు ఆకట్టుకున్నాడో తెలుసు కుందాం పదండీ…

సినిమా కథ పాయింట్ విషయానికి వస్తే రాయలసీమలో చిన్న పిల్లలతో మైనింగ్ మాఫియా నడిపించే డేంజరస్ విలన్ కి సిటీలో ఒక జాబ్ కి జాయిన్ అయిన కంపెనీలో సీఈఓ అయిన హీరోయిన్ తో లవ్ లో ఉన్న హీరోకి మధ్య ఎలా గొడవ జరిగింది, ఆ తర్వాత కథ ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే….

ఓవరాల్ గా చాలా రొటీన్ స్టోరీ పాయింట్ తో తెరకెక్కిన మాస్ కమర్షియల్ మూవీ అయిన ఆదికేశవ సినిమా మాస్ హీరోగా పంజా వైష్ణవ్ తేజ్ ను బాగానే ప్రజెంట్ చేయగా ఫైట్ సీన్స్ లో బాగానే ఆకట్టుకున్నాడు వైష్ణవ్ తేజ్, కొన్ని ఎలివేషన్ మాస్ సీన్స్ కూడా బాగానే ఉన్నప్పటికీ అసలు కథలోనే దమ్ము లేకపోవడంతో…

ఆ మాస్ మూమెంట్స్ బాగున్నప్పటికీ పెద్దగా సినిమా ఇంప్రెస్ చేయలేక పోయింది, శ్రీలీల మరోసారి తన రోల్ వరకు మెప్పించగా విలన్ గా తొలిసారి ఇక్కడ నటించిన జోజు జార్జ్ బాగానే అదరగొట్టేశాడు అని చెప్పొచ్చు, పాటలు పర్వాలేదు అనిపించగా బ్యాగ్రౌండ్ స్కోర్ కొన్ని మాస్ సీన్స్ కి బాగానే సెట్ అయింది,

ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే చాలా నీరసంగా ఉండగా యాక్షన్ సీన్స్ కి ఎడిటింగ్ బాగున్న మిగిలిన సినిమా మొత్తం ఆడియన్స్ అంచనాలకు తగ్గట్లు స్లోగా సాగుతుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగుండగా సినిమాను రిచ్ గా తీశారు, ఇక డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ చాలా రొటీన్ పాయింట్ కాగా…

మాస్ సీన్స్ వరకు, హీరోని ప్రజెంట్ చేసిన తీరు అలాగే విలన్ రోల్ ని బాగానే చూపించాడు, కానీ ఓవరాల్ గా కథే వీక్ గా ఉండటంతో మాస్ సీన్స్ బాగున్నా పెద్దగా ఇంపాక్ట్ లేకుండా పోయింది… అలాగే స్క్రీన్ ప్లే కూడా ఈజీగా గెస్ చేసేలా ఉండటం కూడా మేజర్ డ్రా బ్యాక్. ఓవరాల్ గా సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్ కి వెళ్ళే ఆడియన్స్ కి…

మాస్ మూమెంట్స్ పరంగా పర్వాలేదు అనిపించవచ్చు కానీ ఓవరాల్ గా కథ పరంగా సినిమా పరంగా మాత్రం యావరేజ్ కి అటూ ఇటూగా ఉంటుందని చెప్పొచ్చు. మొత్తం మీద చాలా తక్కువ అంచనాలతో వెళితే కొన్ని సీన్స్ అలాగే యాక్షన్ పార్ట్ పరంగా పర్వాలేదు అనిపించేలా సినిమా ఇంప్రెస్ చేయవచ్చు, సినిమా కి మా ఫైనల్ రేటింగ్ 2.5 స్టార్స్….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here