5 ఏళ్ల క్రితం ఆడియన్స్ ముందుకు మంచి అంచనాల నడుమ రిలీజ్ అయ్యి మొదటి షో కే తీవ్ర నెగటివ్ టాక్ ని సొంతం చేసుకున్న సినిమా బ్రహ్మోత్సవం అని చెప్పొచ్చు. అంతకుముందు మహేష్ బాబు కి సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి క్లాస్ మూవీ ఇచ్చిన డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల బ్రహ్మోత్సవం తో ఎప్పటికీ గుర్తు పెట్టుకునే డిసాస్టర్ ని కూడా ఇచ్చాడు. ఆ సినిమా తర్వాత మహేష్ తేరుకుని ఆడియన్స్ ను అలరిస్తున్నాడు.
మరో పక్క డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల మాత్రం కొత్త సినిమా కోసం ఏళ్ళు ఎదురు చూడగా అసలు ఎవ్వరూ ఊహించని విధంగా తన శైలి కి పూర్తీ విరుద్దమైన కథ తో వెంకటేష్ తో నారప్ప సినిమాను ఒప్పుకున్నాడు, తమిళ్ బ్లాక్ బస్టర్ అసురన్ సినిమా తెలుగు…
రీమేక్ గా ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఈ సినిమా కోసం అందరూ ఆశగా ఎదురు చూస్తూ ఉండగా క్లాస్ సినిమాల డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల మాస్ సీన్స్ ని ఎలా తీసి ఉంటాడా అని ఆసక్తి ఎక్కువగా ఉండగా ఈ సినిమా తర్వాత అడ్డాల మరో ప్రాజెక్ట్ ను ఆల్ మోస్ట్ కన్ఫాం చేశారని అంటున్నారు.
ఈ సారి కూడా అందరికీ మైండ్ బ్లాంక్ చేస్తూ మరో రా రస్టిక్ కథనే రీమేక్ గా ఎంచుకున్నారని సమాచారం. రీసెంట్ గా ధనుష్ నటించిన కెరీర్ బిగ్గెస్ట్ హిట్ మూవీ కర్ణన్ సినిమా ను తెలుగు లో బెల్లంకొండ శ్రీనివాస్ తో రీమేక్ చేయబోతుండగా ఈ సినిమా తెలుగు రీమేక్ కి డైరెక్టర్ గా అడ్డాలని ఎంచుకున్నారని తెలుస్తుంది.
అసలే ధనుష్ పెర్ఫార్మెన్స్ ని బెల్లంకొండ ఎంతవరకు మ్యాచ్ చేస్తాడు అన్నది ఆసక్తిగా మారగా ఇప్పుడు ఈ సినిమాను అడ్డాలకి అప్పగించడం తో ఇటు డైరెక్టర్ అటు హీరో మీద లెక్కకి మించిన ప్రెజర్ ఉండటం ఖాయమని చెప్పొచ్చు. మరి ఒకవేళ ఇది కన్ఫాం అయితే ఇద్దరూ ఎంతవరకు న్యాయం చేస్తారో చూడాలి ఇక..