Home న్యూస్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఫస్ట్ టాక్ వచ్చేసింది…సెన్సార్ రిపోర్ట్ ఏంటంటే!!

అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఫస్ట్ టాక్ వచ్చేసింది…సెన్సార్ రిపోర్ట్ ఏంటంటే!!

0

బాక్స్ అఫీస్ దగ్గర మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న టాలీవుడ్ హీరోలలో ఒకరైన నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి(Arjun Son Of Vyjayanthi Movie) వచ్చే వీక్ లో ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతూ ఉండగా…సినిమా మీద ఆడియన్స్ లో…

టీసర్ రిలీజ్ తర్వాత డీసెంట్ బజ్ అయితే ఉందని చెప్పాలి…పటాస్ కాన్సెప్ట్ ను కొంచం మార్చి ఈ సినిమాను వేరే యాంగిల్ లో తీస్తున్నట్లు టీసర్ రిలీజ్ తర్వాత అనిపించగా ఎమోషనల్ పార్ట్ అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ సినిమాలో మేజర్ హైలెట్స్ గా మారబోతున్నాయని..

అంటూ ఉండగా రీసెంట్ గా సినిమా సెన్సార్ పనులను పూర్తి చేసుకుంది…రిలీజ్ కి వారం ఉండగానే అన్ని పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమా కి యు/ఏ సర్టిఫికేట్ ను సొంతం చేసుకోగా ఓవరాల్ 2 గంటల 24 నిమిషాల రన్ టైంతో ఆడియన్స్ ముందుకు రాబోతూ ఉండగా…

సెన్సార్ వాళ్ళ నుండి ఫస్ట్ టాక్ కూడా బయటికి వచ్చేసింది అని చెప్పాలి. స్టోరీ పాయింట్ ను పూర్తిగా రివీల్ చేయలేదు కానీ…తల్లి మీద ఎంత ప్రేమ ఉన్నా కూడా సమాజంలో జరుగుతున్నా అన్యాయాలను ఆపడానికి పోలిస్ అవ్వాల్సిన కొడుకు ఆ పదవికి నో చెప్పి…రౌడీ గా మారడం…

కొడుకుని అరెస్ట్ చేయడానికి తల్లి ఏం చేసింది అన్న కాన్సెప్ట్ తో రూపొందుతున్న అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఫస్టాఫ్ వరకు మంచి సీన్స్ తో పాటు కమర్షియల్ గా వర్కౌట్ అయ్యే హీరో ఎలివేషన్ సీన్స్ తో మెప్పిస్తూ ఇంటర్వెల్ ఎపిసోడ్ హైలెట్ గా నిలుస్తుందని..

ఇక సెకెండ్ ఆఫ్ లో తల్లి కొడుకుల మధ్య జరిగే సంఘర్షణ అలాగే విలన్ తో హీరో గొడవ మరో వైపు నువ్వా నేనా అన్నట్లు సీన్స్ ఉంటాయని, ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాలో వచ్చే ఫైట్స్ కి సాలిడ్ గా హై ఇచ్చేలా ఉంటాయని చెబుతూ ఉండగా ఓవరాల్ గా సినిమా…

పటాస్ రేంజ్ లో ఉంటుందని, అలాగే రీసెంట్ కళ్యాణ్ రామ్ మూవీస్ అన్నింటి కన్నా కూడా చాలా బెటర్ గా ఉంటుందని అయితే టాక్ ఉంది. మొత్తం మీద సెన్సార్ వాళ్ళ నుండి సినిమాకి మంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఉందని చెప్పాలి. ఇక సినిమా వచ్చిన తర్వాత ఇదే నిజం అయితే కచ్చితంగా కళ్యాణ్ రామ్ కి సాలిడ్ కంబ్యాక్ మూవీగా నిలవడం ఖాయమని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here