టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) నటించిన సినిమాలు చాలా వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కౌట్ అవ్వడమే కాదు టెలివిజన్ లో కూడా కుమ్మేశాయి…ఇప్పుడు వస్తున్న సినిమాలు అంటే తక్కువ సార్లు టెలికాస్ట్ అయ్యాయి కానీ మహేష్ బాబు నటించిన మురారి…అతడు లాంటి సినిమాలు టెలివిజన్ లో అనేక సార్లు…
టెలికాస్ట్ అయ్యి సంచలనం సృష్టించగా…. వీటిలో కూడా అతడు సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ లో మరీ అనుకున్న అంచనాలను అందుకోలేక పోయినా కూడా టెలివిజన్ లో మాత్రం ఎపిక్ సక్సెస్ అయ్యింది…టెలివిజన్ రైట్స్ విషయంలో ఎక్స్ లెంట్ రేటుని…
రెన్యూ చేసే టైంలో కూడా సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసిన అతడు సినిమా ఇప్పుడు టెలివిజన్ లో ఆల్ టైం ఎపిక్ రికార్డ్ ను నమోదు చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం…టెలివిజన్ లో ఆల్ టైం హైయెస్ట్ సార్లు టెలికాస్ట్ అయిన మూవీస్ తో ముందు నిలిచే రేంజ్ లో..
అతడు సినిమా ఎపిక్ రికార్డ్ ను సృష్టించిందట. ఆల్ మోస్ట్ 1500 సార్లు ఈ సినిమా టెలివిజన్ లో టెలికాస్ట్ అయ్యిందట…. ఇది ఆల్ టైం రికార్డ్ అని చెప్పాలి. 2005 టైంలో రిలీజ్ అయిన ఈ సినిమా తర్వత టెలివిజన్ లో ఆల్ మోస్ట్ ప్రతీ ఒకటి రెండు రోజుల గ్యాప్ తో…
ఎప్పటి కప్పుడు టెలికాస్ట్ అవుతూనే వచ్చింది. ఇండియన్ మూవీస్ లో హిందీ లో సూర్వవంశం సినిమా కూడా ఇదే రేంజ్ లో టెలికాస్ట్ అయినా కూడా అతడు సినిమా మరింత ఎక్కువ గానే టెలికాస్ట్ అయ్యి హైయెస్ట్ నంబర్ ఆఫ్ టెలికాస్ట్ ల రికార్డ్ ను నమోదు చేసిందని చెప్పోచ్చు…ఇది ఆల్ మోస్ట్ వరల్డ్ రికార్డ్ అని చెబుతూ ఉండటం విశేషం…