Home న్యూస్ బంగారు బుల్లోడు ట్రైలర్ రివ్యూ…బాగానే ఉంది ట్రైలర్!!

బంగారు బుల్లోడు ట్రైలర్ రివ్యూ…బాగానే ఉంది ట్రైలర్!!

522
0

బాక్స్ ఆఫీస్ దగ్గర అల్లరి నరేష్ హిట్ కొట్టి చాలా కాలమే అయింది, సుడిగాడు తర్వాత అప్పుడప్పుడు ఎదో ఒకటి అరా సినిమాలు బాగున్నట్లే బాగున్నాయి అనిపించుకున్న కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఏవి కూడా పెద్దగా సక్సెస్ అయితే కాలేదు.. ఎన్ని ప్రయత్నాలు చేసినా బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ ను అందుకోని అల్లరి నరేష్ మరోసారి ప్రేక్షకుల ముందుకు తన లక్ ని పరీక్షించు కోవడానికి…

బంగారు బుల్లోడు సినిమా తో రాబోతున్నాడు. చాలా టైం నుండే డిలే అవుతున్న ఈ సినిమా ఈ నెల 23 న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది. ఇక సినిమా ట్రైలర్ ను రీసెంట్ గా లాంచ్ చేశారు. కాగా ట్రైలర్ చూస్తుంటే ప్రామిసింగ్ గా అనిపిస్తుందని చెప్పొచ్చు.

గోల్డ్ లోన్ బ్యాంక్ లో పని చేసే హీరో గా అల్లరి నరేష్ కామెడీ అక్కడక్కడా మెప్పించాగా బ్యాంక్ లో 100 సవర్ల బంగారం దొంగిలించబడుతుంది… అది ఎవరు దొంగిలించారు, ఎలా కనిపెట్టారు అనే కాన్సెప్ట్ తో కంప్లీట్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న సినిమానే బంగారు బుల్లోడు.

కన్ఫ్యూజ్ కామెడీ ని బేస్ చేసుకున్న ఈ సినిమా ట్రైలర్ వరకు అయితే కాన్సెప్ట్ ఏంటి అనేది క్లియర్ అవ్వగా ట్రైలర్ కి రెస్పాన్స్ బాగానే ఉందని చెప్పాలి. కాన్సెప్ట్ తెలిసి పోవడం తో ఇక కామెడీ ఆడియన్స్ ను మెప్పించగలిగితే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ట్రైలర్ లో అక్కడక్కడా కొన్ని కామెడీ బిట్స్ బాగానే ఇంప్రెస్ చేయగా వెన్నెల కిషోర్ కామెడీ బాగుంటుంది అని…

ఆల్ రెడీ టీం ఇది వరకే చెప్పారు… మరి సినిమా రిలీజ్ అయ్యాక అది ప్లస్ అయితే సినిమా కి మరింత కలిసి వచ్చే అంశమే అని చెప్పాలి. ఇక ట్రైలర్ రీచ్ బాగుంటే సినిమా కి ఓపెనింగ్స్ బాగుంటాయి. ఎందుకో ఈ సారి అల్లరి నరేష్ బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ ను సొంతం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉందనిపిస్తుంది.. ఇదే నిజం అవ్వాలని అందరం కోరుకుందాం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here