బాక్స్ ఆఫీస్ దగ్గర 2014 లో మొదటి సినిమా చేసినా కానీ మొదటి క్లీన్ హిట్ ని అందుకోవడానికి ఏకంగా 5 ఏళ్ళు ఎదురు చూసిన బెల్లంకొండ శ్రీనివాస్ తమిళ్ బ్లాక్ బస్టర్ రాక్షసన్ తెలుగు రీమేక్ రాక్షసుడు తో మంచి విజయాన్ని నమోదు చేయగా 5 ఏళ్ల తర్వాత క్లీన్ హిట్ కొట్టిన ఊపులో ఉన్న బెల్లంకొండ ఇప్పుడు వరుస పెట్టి సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నారు. రాక్షసుడు టైం లోనే ఒప్పుకున్న సినిమా..
అల్లుడు అదుర్స్ ఆల్ మోస్ట్ ఫైనల్ స్టేజ్ లో ఉండగా త్వరలోనే ఆ సినిమా పూర్తీ చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా తర్వాత వరుస సినిమాలతో జోరు చూపాలి అని భావిస్తూనే సినిమాల ఎంపిక విషయం లో కూడా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాడట.
కథలు హిట్ అవుతాయి అన్న నమ్మకం కలిగినవనే ఎంచుకుంటున్నాడని సమాచారం. అందులో భాగంగా అల్లుడు అదుర్స్ సినిమా తర్వాత సుదీర్ వర్మ డైరెక్షన్ లో ఓ డిఫెరెంట్ యాక్షన్ మూవీ ని కమిట్ అయ్యాడట బెల్లంకొండ శ్రీనివాస్, ఇప్పటి వరకు తను చేసిన సినిమాలకు పూర్తీ విరుద్ధంగా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు.
ఇక ఈ సినిమా తర్వాత తన కి తొలి హిట్ ని అందించిన డైరెక్టర్ రమేష్ వర్మ డైరెక్షన్ లో తొలి హిట్ కొట్టిన రాక్షసుడు సినిమా కి సీక్వెల్ ని ప్లాన్ చేస్తున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఈ రెండు సినిమా లు కూడా వేటికవే డిఫెరెంట్ జానర్ మూవీస్ అవ్వడం ఇప్పుడు రిలీజ్ కి సిద్ధంగా ఉన్న అల్లుడు అదుర్స్ పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ అవ్వడంతో…
ఇవన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను అందుకుంటే బెల్లంకొండ క్రేజ్ మరింత పెరగడం ఖాయమని చెప్పొచ్చు. ఇది వరకు భారీ బడ్జెట్ మూవీస్ నే టార్గెట్ చేసిన బెల్లంకొండ ఇప్పుడు అది ముఖ్యం కాదని కంటెంట్ ఉన్న సినిమాలే ముఖ్యం అని అలాంటి సినిమాలనే ఎంచుకుంటున్నాడు. ఇక ఈ సినిమాలతో తన రేంజ్ ఎంత పెరుగుతుందో చూడాలి మరి…