Home న్యూస్ 24 గంటలు ఓవర్…..టాప్ లేపిన రికార్డ్ ఇది!!

24 గంటలు ఓవర్…..టాప్ లేపిన రికార్డ్ ఇది!!

1824
0

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ భీమ్లా నాయక్ సినిమా టైటిల్ సాంగ్ ని రీసెంట్ గా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కానుకగా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. సాంగ్ గ్లిమ్స్ లో పెట్టిన థీం సాంగ్ అనుకున్నారు కానీ ఇది కంప్లీట్ గా డిఫెరెంట్ సాంగ్ ని రిలీజ్ చేసినా రెస్పాన్స్ పాజిటివ్ గానే వచ్చింది. దాంతో పాటు ఇప్పుడు 24 గంటల్లో సంచలన రెస్పాన్స్ ను కూడా….

ఈ సాంగ్ సొంతం చేసుకోవడం విశేషం… ఇక మొత్తం మీద భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ కి 24 గంటల్లో యూట్యూబ్ లో రియల్ టైం వ్యూస్ 9.7 మిలియన్ మార్క్ ని అందుకోగా అప్ డేట్ అయిన వ్యూస్ 8.28 మిలియన్ మార్క్ ని అందుకుంది. ఇక లైక్స్ పరంగా…

24 గంటల్లో 805.5K లైక్స్ మార్క్ ని అందుకుని టాలీవుడ్ లో ఆల్ టైం రికార్డులను నమోదు చేసింది. కానీ వ్యూస్ పరంగా కొత్త రికార్డులను అందుకోవడంలో జస్ట్ లో మిస్ చేసుకుంది. వ్యూస్ పరంగా పుష్ప లోని దాక్కో దాక్కో మేక 8.32M వ్యూస్ తో ఇప్పటికీ టాప్ లో ఉండగా…

భీమ్లా నాయక్ సాంగ్ టాప్ 2 ప్లేస్ ను అందుకుంది. ఈ రెండు వ్యూస్ పరంగా సౌత్ లో కూడా టాప్ 2 లో ఉండటం విశేషం. ఇక లైక్స్ పరంగా దాక్కో దాక్కో మేక 657K లైక్స్ తో ఉండగా ఆ రికార్డ్ ను బ్రేక్ చేసిన భీమ్లా నాయక్ సాంగ్ భారీ లీడ్ తో టాప్ ప్లేస్ ని అందుకోగా సౌత్ లో మొత్తం మీద…

అజిత్ వలిమై సాంగ్ 1.04 మిలియన్ లైక్స్, విజయ్ మాస్టర్ కుట్టిసాంగ్ 1.00 మిలియన్ తర్వాత ప్లేస్ లో నిలిచి దుమ్ము లేపింది. ఒక పక్క బర్త్ డే విషెస్ ట్వీట్స్ తో ఆఫ్ లైన్ సెలబ్రేషన్స్ తో దుమ్ము లేపుతూనే మరో పక్క సాంగ్ కి అల్టిమేట్ రెస్పాన్స్ వచ్చేలా చేశారు ఫ్యాన్స్. ఇక సినిమా అప్ కమింగ్ సాంగ్స్ ఏ రేంజ్ లో రచ్చ చేస్తాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here