Home న్యూస్ డాక్టర్ తమిళ్-తెలుగు బిజినెస్…..ఇండియాలో కొత్త రికార్డ్!!

డాక్టర్ తమిళ్-తెలుగు బిజినెస్…..ఇండియాలో కొత్త రికార్డ్!!

0

కోలివుడ్ లో ఈ ఇయర్ రిలీజ్ అయిన సినిమాలో మాస్టర్ తర్వాత కర్ణన్ సినిమా హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకుంది, ఆ సినిమా తర్వాత మళ్ళీ అలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకునే ఛాన్స్ ఉన్న సినిమాగా భావించిన శివకార్తికేయన్ నటించిన డాక్టర్ సినిమా డైరెక్ట్ రిలీజ్ కి ఆఫర్స్ వచ్చినా నో చెప్పి ఇప్పుడు థియేటర్స్ లో తమిళ్ తో పాటు తెలుగు లో కూడా ఒకే టైం లో రిలీజ్ కానుంది.

సినిమా ఓవరాల్ గా సాధించిన తమిళ్ మరియు తెలుగు బిజినెస్ లెక్కలు ఇప్పుడు బయటికి వచ్చాయి. ఒకసారి వివరాలను గమనిస్తే… ముందుగా తెలుగు డబ్బింగ్ విషయానికి వస్తే 1.35 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సినిమా ఇక్కడ సొంతం చేసుకోగా క్లీన్ హిట్ కోసం 1.6 కోట్ల లోపు షేర్ ని అందుకోవాలి.

ఇక నైజాంలో 59 థియేటర్స్ లో టోటల్ ఆంధ్ర ప్రదేశ్ లో 125 థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న సినిమా తెలుగు రాష్ట్రాలలో 185 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఇక తమిళనాడు లో సినిమా ఏకంగా 27.6 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకుందట. ఓవర్సీస్ లో 6.2 కోట్ల బిజినెస్ ను…

సొంతం చేసుకున్న సినిమా కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 1 కోటి వరకు బిజినెస్ ను అందుకుందట… దాంతో టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ తెలుగు తో కలిపి 36.15 కోట్ల బిజినెస్ ను అందుకుని సెకెండ్ వేవ్ తర్వాత ఇండియాలో హైయెస్ట్ బిజినెస్ ను సొంతం చేసుకున్న సినిమాగా సంచలన రికార్డ్ ను నమోదు చేసింది. బెల్ బాటం ముందు ఎక్కువ బిజినెస్ ను…

అందుకున్నా తర్వాత చాలా తగ్గించారు… తర్వాత లవ్ స్టొరీ రికార్డ్ కొట్టగా ఇప్పుడు ఈ సినిమా ఆ రికార్డ్ ను బ్రేక్ చేసి బిజినెస్ పరంగా కొత్త రికార్డ్ ను అందుకుంది. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా హిట్ అవ్వాలి అంటే కోలివుడ్ ట్రేడ్ లెక్కల్లో 67-70 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్స్ ని వరల్డ్ వైడ్ గా సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. మరి సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here