బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా ఆల్ మోస్ట్ ఒకే తరహా కథతో వచ్చిన సినిమాలు హృతిక్ రోషన్(Hrithik Roshan) నటించిన ఫైటర్(Fighter Movie) మరియు వరుణ్ తేజ్(Varun Tej) నటించిన ఆపరేషన్ వాలెంటైన్(Operation Valentine Movie)లు…. నెలన్నర గ్యాప్ లో వచ్చిన ఈ రెండు సినిమాలు కూడా…ఎయిర్ ఫోర్స్ నేపధ్యంలో…
తెరకెక్కగా హిందీలో లోకల్ గా పర్వాలేదు అనిపించి ఓవర్సీస్ లో కుమ్మేసిన ఫైటర్ మూవీ అక్కడ బ్లాక్ బస్టర్ గా ఇక్కడ ఎబో యావరేజ్ లెవల్ లో నిలిచింది, ఇక ఆపరేషన్ వాలెంటైన్ సినిమా మాత్రం అన్ని చోట్లా నిరాశ పరిచే రిజల్ట్ నే సొంతం చేసుకుంది అని చెప్పాలి…
ఇక ఈ రెండు సినిమాలు కూడా చాలా తక్కువ గ్యాప్ లో డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకోగా ఫైటర్ మూవీ నెట్ ఫ్లిక్స్ లో ఆపరేషన్ వాలెంటైన్ సినిమా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేయగా ఇక్కడ డిజిటల్ రిలీజ్ తర్వాత కూడా రెండు సినిమాల మధ్య కంపారిజన్ లో మొదలు అవ్వగా ఇక్కడ కూడా రెండు సినిమాలు…
మరీ అద్బుతం కాదు కానీ ఉన్నంతలో విజువల్స్ పరంగా గ్రాండియర్ పరంగా ఎక్కువ బడ్జెట్ తో వచ్చిన ఫైటర్ ఎంతో కొంత బెటర్ గా అనిపించగా ఆపరేషన్ వాలెంటైన్ మాత్రం 46 కోట్ల రేంజ్ బడ్జెట్ లో బిలో పార్ VFX అండ్ పూర్ టేకింగ్ తో నిరాశ పరిచింది అంటూ కామెంట్ చేస్తున్నారు…. ఫైటర్ కన్నా ముందు…
థియేటర్స్ లో అలాగే డిజిటల్ లో రిలీజ్ అయితే రిజల్ట్ కొంచం బెటర్ గా ఉండేదేమో కానీ ఫైటర్ తర్వాత రిలీజ్ అవ్వడంతో అటు థియేటర్స్ లో ఇటు డిజిటల్ లో కూడా ఆపరేషన్ వాలెంటైన్ సినిమా నిరాశ పరిచింది అనే చెప్పాలి… ఇక టెలివిజన్ లో సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ సొంతం అవుతుందో చూడాలి.