Home న్యూస్ గుడ్ బ్యాడ్ అగ్లీ ప్రీమియర్స్ షో రివ్యూ….హిట్టా-ఫట్టా!!

గుడ్ బ్యాడ్ అగ్లీ ప్రీమియర్స్ షో రివ్యూ….హిట్టా-ఫట్టా!!

0

వరల్డ్ వైడ్ గా సమ్మర్ కానుకగా భారీ అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు కోలివుడ్ టాప్ హీరోలలో ఒకరైన అజిత్ కుమార్(Ajith Kumar) నటించిన కొత్త సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ(Good Bad Ugly Movie) మూవీ గ్రాండ్ గా రిలీజ్ అవ్వగా, ముందుగా ప్రీమియర్స్ ను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా కి అక్కడ నుండి ఫస్ట్ టాక్ వచ్చేసింది…

స్టోరీ పాయింట్ ను ఏమి రివీల్ చేయడం లేదు కానీ ఎన్నో గ్యాబ్లింగ్ లు గొడవలు చేసి ఉన్న హీరో రిటైర్ అవుతాడు, కానీ అనుకోకుండా తిరిగి తన కొడుకు కోసం మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వాల్సి వస్తుంది…ఇక ఆ తర్వాత కథ ఏంటి అనేది మాత్రం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…

సినిమా ఫస్టాఫ్ కంప్లీట్ గా ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ లా అనిపించడం ఖాయమని చెప్పాలి. వింటేజ్ అజిత్ కుమార్ ని చూపించిన విధానం, మ్యానరిజమ్స్ హీరోయిజం ఎలివేట్ సీన్స్ ఇలా అన్నీ కూడా పెర్ఫెక్ట్ గా సెట్ అవ్వగా అజిత్ తన మాస్ స్వాగ్ తో కుమ్మేశాడు…ఒక సాలిడ్ పాయింట్ తో…

ఇంటర్వెల్ కార్డ్ పడగా సెకెండ్ ఆఫ్ మీద అంచనాలు పెరిగినా చాలా వరకు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తోనే సాగగా మళ్ళీ ప్రీ క్లైమాక్స్ నుండి జోరు అందుకున్నా కూడా ఫస్టాఫ్ ఇచ్చిన రేంజ్ లో కిక్ సెకెండ్ ఆఫ్ కొంచం క్యారీ చేయలేక పోయింది కానీ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం…

చాలా వరకు సినిమా అంచనాలను అందుకున్నట్లుగానే అనిపించింది అని చెప్పాలి. ముఖ్యంగా ఫ్యాన్స్ కి సినిమా కొన్ని అప్ డౌన్స్ లా అనిపించినా ఫుల్ మీల్స్ పెట్టేలా ఉందని చెప్పాలి. మిగిలిన ఆడియన్స్ కి మాత్రం సినిమా కొంచం రొటీన్ స్టఫ్ గానే అనిపించేలా ఉంటుంది అని చెప్పాలి.

ఓవరాల్ గా ఫస్టాఫ్ ఎబో యావరేజ్ లెవల్ లో అనిపించగా సెకెండ్ ఆఫ్ సినిమా యావరేజ్ టు ఎబో యావరేజ్ కి మధ్యలో అనిపించింది అని చెప్పాలి. టోటల్ మూవీ కూడా ఎబో యావరేజ్ కి అటూ ఇటూలా అనిపించింది అని చెప్పాలి. ఫ్లాష్ బ్యాక్ కొంచం తగ్గించి కొంచం కన్ఫ్యూజిక్ స్క్రీన్ ప్లే కాకుండా…

మరింత క్రిస్ప్ గా స్క్రీన్ ప్లే రాసుకుని ఉంటే సినిమా ఇంకా బాగా మెప్పించేదని టాక్ అయితే వినిపిస్తుంది. ప్రీమియర్స్ కి డీసెంట్ టు గుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న గుడ్ బ్యాడ్ అగ్లీ ఇక రెగ్యులర్ షోలకు ఇదే టాక్ లేదా బెటర్ టాక్ ను సొంతం చేసుకుంటే లాంగ్ వీకెండ్ లో కుమ్మేయడం ఖాయమని చెప్పొచ్చు ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here