Home న్యూస్ పుష్ప2 రికార్డ్ దిశగా దూసుకు పోతున్న గుంటూరు కారం!

పుష్ప2 రికార్డ్ దిశగా దూసుకు పోతున్న గుంటూరు కారం!

0

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం వచ్చే సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా అఫీషియల్ టైటిల్ ని అనౌన్స్ చేస్తూ రీసెంట్ గా సినిమా గ్లిమ్స్ ను రిలీజ్ చేశారు… మహేష్ బాబు మాస్ స్వాగ్, త్రివిక్రమ్ టేకింగ్, తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ లు ఆకట్టుకోవడంతో ఈ గ్లిమ్స్ కి ఆడియన్స్ నుండి..

అద్బుతమైన రెస్పాన్స్ సొంతం అవ్వగా వ్యూస్ పరంగా అల్టిమేట్ రికార్డులను నమోదు చేస్తూ దూసుకు పోతుంది ఈ గ్లిమ్స్… టాలీవుడ్ లో ఇప్పటి వరకు వచ్చిన గ్లిమ్స్ లో టాప్ వ్యూస్ ని 24 గంటల్లో సొంతం చేసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప2 సినిమా గ్లిమ్స్…

24 గంటల్లో తెలుగు వర్షన్ ఓవరాల్ గా 20.45 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుని టాలీవుడ్ గ్లిమ్స్ లో ఆల్ టైం రికార్డ్ ను నమోదు చేసింది. ఇక ఇప్పుడు గుంటూరు కారం గ్లిమ్స్ 15 గంటల లోపే 16 మిలియన్స్ కి పైగా వ్యూస్ ని ఆల్ రెడీ సొంతం చేసుకోగా…

మిగిలిన టైంలో మరో 4 మిలియన్స్ కి పైగా వ్యూస్ ని సొంతం చేసుకుంటే టాలీవుడ్ గ్లిమ్స్ లో ఆల్ టైం రికార్డ్ నమోదు అయ్యే అవకాశం ఉంది, లైక్స్ పరంగా మాత్రం ఇతర గ్లిమ్స్ తో పోల్చితే చాలా వెనకబడిన గుంటూరు కారం… కేవలం 3 లక్షల లైక్స్ తోనే ఉంది… లైక్స్ విషయంలో వెనుకంజ వేసినా వ్యూస్ పరంగా మాత్రం ఈ గ్లిమ్స్ కుమ్మేస్తుందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here