టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం(Guntur Kaaram Movie) సంక్రాంతి కి రిలీజ్ అయ్యి మిక్సుడ్ రెస్పాన్స్ తో కూడా 100 కోట్లకు పైగా షేర్ మార్క్ ని అందుకుని మహేష్ బాబు మాస్ రచ్చని నిరూపించగా హిట్ టాక్ కనుక సొంతం అయ్యి ఉంటే సినిమా…
బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ రచ్చ చేసి ఉండేది… మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డిజిటల్ లో రిలీజ్ అవ్వగా అక్కడ సాలిడ్ వ్యూవర్ షిప్ తో దుమ్ము లేపగా సినిమా రెండు వారాల్లో అక్కడ ఆల్ మోస్ట్ 5 మిలియన్స్ వరకు వ్యూస్ ను సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపగా…
తెలుగు తో పాటు సినిమా ఇతర సౌత్ భాషల వ్యూవర్ షిప్ కూడా సాలిడ్ గా ఉండగా హిందీ లో మాత్రం మరో లెవల్ లో రచ్చ లేపుతుంది ఈ సినిమా… మొదటి వారంలో హిందీలో సినిమా కి 1.1 మిలియన్ వ్యూస్ సొంతం అవ్వగా రెండో వారంలో రెట్టించిన జోరు చూపించిన సినిమా ఏకంగా 1.8 మిలియన్స్ వరకు వ్యూస్ ను సొంతం చేసుకుని…
మాస్ రచ్చ లేపుతూ ఎక్స్ లెంట్ గ్రోత్ ని చూపించింది….. ఈ రేంజ్ లో హిందీలో సినిమా డబ్ వర్షన్ ఇలా ట్రెండ్ అవ్వడం విశేషం కాగా ఇతర దేశాల్లో కూడా సినిమా హిందీ వర్షన్ ట్రెండ్ అవుతూ ఉండటం మరింత విశేషం అని చెప్పాలి. దాంతో సినిమా డిజిటల్ లో సూపర్ హిట్ గా దూసుకు పోతుంది అని చెప్పాలి ఇప్పుడు.