కాగా వివరాల్లోకి వెళితే ముందుగా సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారో చెప్పిన జక్కన్న బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఫ్లాష్ బ్యాక్ లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడని, ఇక ఆలియా భట్ రామ్ చరణ్ కి జోడిగా నటిస్తుందని, ఇక ఎన్టీఆర్ కి జోడిగా…
ఫారన్ హీరోయిన్ డేసీ ఎడ్గర్ జోన్స్ నటిస్తుందని, మరో పాత్రలో కోలివుడ్ నటుడు సముద్రఖని నటిస్తున్నాడని తెలియజేశారు. ఇక సినిమా స్టొరీ పాయింట్ యంగ్ అల్లూరి సీతారామ రాజు మరియు యంగ్ కొమురం భీమ్ ల ఫీక్షనల్ స్టొరీ పాయింట్ అని తెలియజేశారు.
ఈ ఇద్దరు లెజెండ్స్ యంగ్ ఏజ్ లో డిల్లీ లో దేశం కోసం జరిపిన పోరాటమే సినిమా కథ అని కన్ఫాం చేశారు. మనకు తెలిసింది వాళ్ళు ఆ పోరాటం చేసి తిరిగి వచ్చాక స్వాతంత్ర్యమ్ కోసం చేసిన విషయాలు మాత్రమె అని తెలియని కథ నే ఒక ఫీక్షనల్ స్టొరీగా చెబుతున్నామని చెప్పారు.
ఇక సినిమా బడ్జెట్ సుమారు 350 కోట్ల నుండి 400 కోట్ల దాకా అవుతుందని నిర్మాత చెప్పాగా… సినిమా 2020 జులై 30 న 10 భాషల్లో ఇండియాలో రిలీజ్ అవుతుందని కన్ఫాం చేశారు. RRR అనేది మేజర్ టైటిల్ అని ఏ భాషకి ఆ భాష టైటిల్ ని తర్వాత పెడతామని చెప్పారు. మొత్తం మీద ప్రెస్ మీట్ తో RRR నేషనల్ వైడ్ గా ఒక ఊపు ఊపింది అని చెప్పొచ్చు.