Home న్యూస్ కల్కి 2898 AD ఫస్ట్ బ్రేక్ ఈవెన్ ఏరియా ఇదే…రెబల్ స్టార్ మాస్!

కల్కి 2898 AD ఫస్ట్ బ్రేక్ ఈవెన్ ఏరియా ఇదే…రెబల్ స్టార్ మాస్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర అల్టిమేట్ కలెక్షన్స్ తో మొదటి వీకెండ్ ని కంప్లీట్ చేసుకున్న పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ సినిమా కల్కి 2898AD(Kalki2898AD Movie) వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయ్యి అన్ని చోట్లా ఎక్స్ లెంట్ హోల్డ్ ని కొనసాగిస్తూ దూసుకు పోతూ ఉండగా సినిమా ఇప్పుడు 5 రోజులు పూర్తి అయ్యే టైంకి…

ఒక ఏరియాలో వాల్యూ బిజినెస్ ను దాటేసి బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ బ్రేక్ ఈవెన్ ఏరియాని కంప్లీట్ చేసుకోవడం విశేషం…మిగిలిన చోట్లతో పోల్చితే బాహుబలి(Baahubali) సిరీస్ తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలు కేరళ ఏరియాలో అండర్ పెర్ఫార్మ్ చేస్తూ రాగా…

లాస్ట్ ఇయర్ ఎండ్ లో వచ్చిన సలార్(Salaar) మూవీ ఇక్కడ మంచి జోరునే చూపించిన తర్వాత రీసెంట్ గా రిలీజ్ అయిన కల్కి మూవీ యునానిమస్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా బాక్స్ ఆఫీస్ దగ్గర రోజు రోజుకి కలెక్షన్స్ లో గ్రోత్ ని చూపించి వీకెండ్ లోనే చాలా మొత్తాన్ని వెనక్కి తీసుకువచ్చింది…

ఓవరాల్ గా సినిమా 6 కోట్ల రేంజ్ లో ఇక్కడ వాల్యూ బిజినెస్ ను సాధించగా 4 రోజులు పూర్తి అయ్యే టైంకే ఇక్కడ 5.80 కోట్లకు పైగా షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది. ఇక సినిమా 5వ రోజు వర్కింగ్ డే నే అయినా కూడా కేరళలో ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించడంతో…

ఇక్కడ ఇప్పుడు సినిమా బిజినెస్ ను దాటేసి ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అయింది. ఓవరాల్ గా ఇది వాల్యూ బిజినెస్ అయినా హిట్ అనిపించుకోవడానికి ఒక టార్గెట్ అంటూ కావాలి కాబట్టి సినిమా ఆ టార్గెట్ ను ఇప్పుడు దాటేసి ఓవరాల్ గా ఇక్కడ ఫస్ట్ బ్రేక్ ఈవెన్ ని అందుకున్నట్లు అయింది ఇప్పుడు.

ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మిగిలిన ఏరియాలలో కూడా సినిమా స్టడీ కలెక్షన్స్ జోరు ఇలానే కొనసాగే అవకాశం ఎంతైనా ఉన్న నేపద్యంలో ఓవరాల్ గా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను వరల్డ్ వైడ్ గా సినిమా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here