యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య సాయి పల్లవి ల కాంబినేషన్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ లవ్ స్టొరీ సినిమా టోటల్ రన్ ని కంప్లీట్ చేసుకుని పరిస్థితులు అనుకూలించక పోయినా కానీ బ్రేక్ ఈవెన్ ని ఓవరాల్ గా సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా పరుగును కంప్లీట్ చేసుకుంది. ఇక పరుగు కంప్లీట్ అయ్యే టైం కి కేరళలో థియేటర్స్ అన్నీ రీ ఓపెన్…
అవ్వడంతో వెంటనే సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా లేక పోవడం తో ఒక పక్క కోలివుడ్ నుండి డాక్టర్ సినిమాను మరో పక్క టాలీవుడ్ నుండి లవ్ స్టొరీ సినిమాలను అక్కడ రిలీజ్ చేయబోతున్నారు. లవ్ స్టొరీ సినిమా కేరళలో ఇప్పుడు అక్కడ ప్రేమ తీరం పేరుతో డబ్ అవ్వగా…
ఈ సినిమాను ఫస్ట్ ఇనీషియల్ టెస్ట్ గా సుమారు 49 థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారట. టాక్ బాగుండి కలెక్షన్స్ పెరిగితే సినిమా కి స్క్రీన్స్ ని పెంచే అవకాశం ఉందని అంటున్నారు. మరి లవ్ స్టొరీ సినిమా మలయాళంలో ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుని కలెక్షన్స్ ని రాబట్టగలుగుతుందో చూడాలి ఇక…