2021 ఇయర్ మొదట్లో వరుస పెట్టి సినిమాలు రిలీజ్ అయ్యాయి, ఫస్ట్ వేవ్ ఎఫెక్ట్ తర్వాత జనాలు ఎంతవరకు థియేటర్స్ కి వస్తారో అనుకుంటే వరుస పెట్టి సినిమాలు రిలీజ్ అవ్వడంతో జనాలు కూడా భారీ సంఖ్యలో థియేటర్స్ కి తరలి వచ్చారు. అలా సమ్మర్ వరకు వరుస సినిమాలు రిలీజ్ అయినా సెకెండ్ వేవ్ ఎంటర్ అవ్వడంతో మళ్ళీ సినిమాల రిలీజ్ ఆగిపోగా ఇయర్ స్టార్టింగ్ లో అమెరికా ఇంకా తేరుకునే స్టేజ్ లో ఉండగా…
కంప్లీట్ గా తేరుకుంటున్న టైం లో తిరిగి సినిమాలు ఆగిపోవడంతో ఫస్టాఫ్ గడచిపోయి సెకెండ్ ఆఫ్ లో లవ్ స్టొరీ సినిమా వచ్చే వరకు అంతంత మాత్రమే సినిమాలకు కలెక్షన్స్ రాగా లవ్ స్టొరీ సినిమా కి మంచి టాక్ ఆడియన్స్ నుండి రాగా సినిమా…
అమెరికాలో అల్టిమేట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని 1 మిలియన్ మార్క్ ని అందుకుని ఈ ఇయర్ కి గాను అక్కడ హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాగా నిలిచింది. ఇక ఇయర్ ఇప్పుడు మరో 50 రోజుల్లో ఎండ్ కాబోతుండగా తెలుగు సినిమాల పరంగా అమెరికాలో భారీగా సందడి చేసే అవకాశం అయితే…
పెద్దగా ఏ సినిమాకి కనిపించడం లేదు, బాలయ్య అఖండ, వరుణ్ తేజ్ ఘని లాంటి సినిమాలకు ఓవర్సీస్ లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అన్నది తెలియాల్సి ఉండగా లవ్ స్టొరీ రికార్డ్ 1.25 మిలియన్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం డిసెంబర్ 17 న బరిలోకి దిగుతున్న అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప పార్ట్ 1 కే ఎక్కువగా ఉందని చెప్పాలి. అల్లు అర్జున్ సుకుమార్ ల బ్రాండ్ ఇమేజ్…
ఆల్ రెడీ సూపర్ డూపర్ హిట్ అయిన సాంగ్స్, సెన్సేషనల్ రికార్డ్ కొట్టిన ఇంట్రో టీసర్ సినిమా పై హైప్ ని పెంచుతున్న పోస్టర్స్ ఇలా అన్నీ పుష్పకి కలిసి వస్తున్న అంశాలే. దాంతో లవ్ స్టొరీ నెలకొల్పిన 1.25 మిలియన్ డాలర్స్ రికార్డ్ ను అమెరికాలో పుష్పనే బ్రేక్ చేసి కొత్త రికార్డ్ కలెక్షన్స్ ని అందుకోవచ్చు. దాంతో అప్పటి వరకు లవ్ స్టొరీ రికార్డ్ సేఫ్ గా ఉండటం కూడా ఖాయమే అని చెప్పాలి.