మహర్షి ప్రీమియర్ షో రివ్యూ…హిట్టా–ఫట్టా!!

0
818

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ మహర్షి ఎట్టకేలకు అనేక అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది, 1900 నుండి 2000 లోపు థియేటర్స్ లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ముందుగా ఓవర్సీస్ లో రిలీజ్ అయ్యి అక్కడ నుండి తొలి టాక్ బయటికి వచ్చేసింది, ఆ టాక్ ఎలా ఉందో తెలుసుకుందాం పదండి. కథ పాయింట్ పూర్తిగా చెప్పకున్నా… లైఫ్ లో ఎదగాలి అనుకునే మిడిల్ క్లాస్ ఇంటెలిజెంట్ స్టూడెంట్…

బాగా చదివి అమెరికాలో ఒకే పెద్ద కంపెనీ కి CEO అయ్యాక తన స్నేహితుడి కోసం ఇండియా వస్తాడు, ఎందుకు వచ్చాడు దేని కోసం అన్నది అసలు కథ అంటున్నారు. కాలేజ్ స్టూడెంట్ గా మహేష్ నటన ఆకట్టుకోగా CEO గా ఒకే అనిపిస్తాడని, తర్వాత చేసే ఫార్మర్ రోల్ లో మళ్ళీ ఆకట్టుకుంటాడని అంటున్నారు.

ఇక అల్లరి నరేష్ మరియు పూజా హెడ్గే ల రోల్ ఉన్నంతలో ఆకట్టుకోగా మిగిలిన పాత్రలకు పర్వాలేదు అనిపించే సీన్స్ కొన్నే పడ్డాయని అంటున్నారు. సంగీతం విషయం లో దేవి కి తక్కువ మార్కేలే పడ్డా థియేటర్స్ లో పాటలు వింటున్నప్పుడు బాగానే అనిపించాయని అంటున్నారు. కానీ ఫైట్ సీన్స్ కి మాత్రం బ్యాగ్ గ్రౌండ్ స్కోర్ అదిరి పోయిందని అంటున్నారు.

ఓవరాల్ గా ఫస్టాఫ్ అలరించే విధంగా ఉండగా మంచి పాయింట్ తో ఇంటర్వెల్ తర్వాత సెకెండ్ ఆఫ్ అనుకోని టర్న్ తర్వాత సినిమా స్లో డౌన్ అవుతుందని, మధ్యలో ఫైట్స్ అదిరి పోయినా ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ సీన్స్ వరకు కొన్ని సీన్స్ స్లో గా బోర్ కొట్టేలా ఉంటాయని అంటున్నారు. అవి తప్పితే సినిమా మొత్తం ఆకట్టుకుంటుందని అంటున్నారు.

ఫైనల్ గా ఓవర్సీస్ ఆడియన్స్ సినిమాను ఇష్టపడ్డారని చెప్పొచ్చు. ఎలాగు క్లాస్ మూవీస్ కి అక్కడ పాజిటివ్ టాక్ ఖాయం కాబట్టి ఇప్పుడు రెగ్యులర్ షోలకు కూడా ఇదే రేంజ్ లో టాక్ ని సినిమా సొంతం చేసుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపడం ఖాయమని చెప్పాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

Maharshi Early Bookings Report

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!