మజిలీ డే 6 కలెక్షన్స్…25 కోట్ల ఊచకోత!

0
655

     అక్కినేని నాగ చైతన్య కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతుంది మజిలీ సినిమా, క్లాస్ సినిమా నే అయినా బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ సెంటర్స్ లో కూడా సాలిడ్ కలెక్షన్స్ ని సాధిస్తూ సినిమా వీకెండ్ తర్వాత కూడా వర్కింగ్ డేస్ లో అద్బుతంగా హోల్డ్ చేసి కలెక్షన్స్ ని అందుకుంటుంది, సినిమా 5 రోజుల వసూళ్లు 23.58 కోట్ల షేర్ మార్క్ ని అందుకోగా సినిమా ఇప్పుడు…

6 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 5 వ రోజు తో పోల్చితే 15% టు 20% వరకు డ్రాప్స్ ని మొదటి రెండు షోలకి అందుకుంది, ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోలకి డ్రాప్స్ 25% వరకు డ్రాప్స్ ని ఓవరాల్ గా అందుకుంది, మొత్తం మీద నైజాం, వైజాగ్ మరియు సీడెడ్ ఏరియాలలో..

సినిమా సాలిడ్ గా హోల్డ్ చేయగా మిగిలిన ఏరియాలలో కొంచం ఎక్కువ డ్రాప్స్ వచ్చాయి, కానీ ఓవరాల్ గా వర్కింగ్ డేస్ లో అతి తక్కువ డ్రాప్స్ తో దూసుకు పోతున్న మజిలీ సినిమా 6 వ రోజు ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ ని బట్టి అవలీలగా 1.4 కోట్ల షేర్ ని అందుకోవడం…

ఖాయమని చెప్పొచ్చు, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అనుకున్న విధంగా ఉంటె ఈ లెక్క 1.5 కోట్ల మార్క్ ని అందుకునే చాన్స్ ఉంది, ఇక సినిమా వరల్డ్ వైడ్ గా 1.7 కోట్ల రేంజ్ లో షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకునే చాన్స్ ఉంది, దాంతో సినిమా 6 వ రోజు సాధించిన కలెక్షన్స్ తో…

25 కోట్ల షేర్ మార్క్ ని వరల్డ్ వైడ్ గా క్రాస్ చేయనుంది, ఇది నాగ చైతన్య కెరీర్ లో రెండో సారి 25 కోట్ల షేర్ మార్క్ ని అందుకున్న సినిమాగా చెప్పుకోవాలి, ఇక 6 రోజుల అఫీషియల్ కలెక్షన్స్ వివరాలు ఎలా ఉంటాయో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!