Home TRP రేటింగ్ జీరో షేర్ మూవీ….80 లక్షల రేటు…ఫస్ట్ టైం TRP రేటింగ్ ఇది!!

జీరో షేర్ మూవీ….80 లక్షల రేటు…ఫస్ట్ టైం TRP రేటింగ్ ఇది!!

3844
0

కింగ్ నాగార్జున రీసెంట్ టైం లో పెద్దగా ఫామ్ లో లేరన్న విషయం అందరికీ తెలిసిందే. బాక్స్ ఆఫీస్ దగ్గర 2016 టైం లో సూపర్ ఫామ్ లో ఉన్న నాగార్జున తర్వాత చేసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకటికి మించి ఒకటి తీవ్రంగా నిరాశ పరుస్తూ వస్తున్నాయి. అన్ని సినిమాల బాక్స్ ఆఫీస్ రిజల్ట్ ఒకెత్తు రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో నాగార్జున నటించిన ఆఫీసర్ సినిమా మరో ఎత్తుగా చెప్పుకోవాలి….

ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన మొదటి ఆటకే డిసాస్టర్ టాక్ ని సొంతం చేసుకోగా ఏ దశలో కూడా ఆడియన్స్ ని థియేటర్స్ రప్పించలేక రోజు డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ ని సొంతం చేసుకుని మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర జీరో షేర్ ని సాధించి…

టాలీవుడ్ చరిత్రలోనే జీరో షేర్ ని సాధించిన రేర్ మూవీ గా నిలిచింది. అలాంటి అపకీర్తి ని సొంతం చేసుకున్న ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను ఎవ్వరూ కొనలేదు, దాంతో మూడేళ్ళుగా అలాగే ఉండి పోయిన ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ని రీసెంట్ గా….

స్టార్ మా ఛానెల్ వాళ్ళు 80 లక్షల రేంజ్ లో రేటు చెల్లించి సినిమా హక్కులను సొంతం చేసుకున్నారు. ఇక సినిమాను రీసెంట్ గా టెలివిజన్ లో టెలికాస్ట్ చేయగా ఫస్ట్ టైం టెలికాస్ట్ కి సినిమా కి మొత్తం మీద 2.21 TRP రేటింగ్ మాత్రమె సొంతం అయ్యింది. మూడేళ్ళ క్రితం వచ్చిన డిసాస్టర్ మూవీ కి సాలిడ్ రేంజ్ రేటింగ్ లను ఎక్స్ పెర్ట్ చేయలేం కానీ…

స్టార్ మా ప్రస్తుతం అత్యధిక రేటింగ్ లతో దూసుకు పోతున్న టైం లో ఛానెల్ పెట్టిన రేటు కి ఇంకా బెటర్ రేటింగ్ ను ఎక్స్ పెర్ట్ చేసినా కానీ మొత్తం మీద పెట్టిన రేటు కి ఏమాత్రం న్యాయం చేయలేక పోయింది ఈ సినిమా. మొత్తం మీద అటు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇటు టెలివిజన్ లో కూడా సినిమా తీవ్రంగా నిరాశ పరిచింది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here